అంతర్జాతీయం

ఇస్రో కృషి భేష్.. చైనా నెటిజన్ల ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై చైనా ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రయోగంలో భాగంగా వెళ్ళిన ల్యాండర్ విక్రంతో సంబంధాలు తెగిపోయినంత మాత్రాన దిగులు చెందాల్సిన అవసరం లేదని, అంతరిక్ష పరిశోధనలో ముందుకు దూసుకెళ్ళాలని ప్రజలు ఆకాంక్షించినట్లు అధికార చైనా మీడియా వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై సజావుగా దిగేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో విక్రం ల్యాండర్ సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటికే దాదాపుగా ఈ వ్యోమ నౌక చంద్రుని ఉపరితలానికి 2.1 కిలో మీటరు వరకు చేరుకుంది. ఇస్రో ప్రయోగాన్ని చైనా నెటిజన్లు సీనా వీ బోలో ఎంతగానో ప్రశంసించారు. ఆశ వీడవద్దంటూ భారత శాస్తవ్రేత్తలను కోరారు.
అంతరిక్ష పరిశోధనలో ముందుకు దూసుకెళ్ళడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఎవరు విజయం సాధించినా వారి ప్రయత్నాన్ని శ్లాఘించాల్సిందేనని వీరన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ ఎన్నో గొప్ప ప్రయత్నాలు చేసిందని, ఎన్నో త్యాగాలు చేసిందని మరో నెట్ వినియోగదారున్ని ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ అధికార పత్రిక పేర్కొంది.