అంతర్జాతీయం

పార్లమెంటు రద్దు చట్ట విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 11: బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు స్కాట్‌లాండ్ కోర్టులో చుక్కెదురైంది. యూకే పార్లమెంటును రద్దు చేయడం చట్ట విరుద్ధమని ఆయనకు కోర్టు స్పష్టం చేసింది. అయితే, పార్లమెంటు సస్పెన్షన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయకపోవడం గమనార్హం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మరో రెండు నెలల సమయం ఉంది. ఈలోగా యూకే పార్లమెంటును రద్దు చేయాలని జాన్సన్ సర్కారు నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు స్కాట్లాండ్ కోర్టును ఆశ్రయించాయి. అక్టోబర్ 14వరకు పార్లమెంటును కొనసాగించాలని జాన్సన్‌కు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆ పార్టీలు కోర్టును కోరాయి. అదే నెల 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. ఈ నిర్ణయంపై గత కొంతకాలంగా వాదోపవాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో కూడా ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.