అంతర్జాతీయం

అడెన్‌లో రక్తపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెన్, ఆగస్టు 29:యెమన్ పట్టణమైన అడెన్ సోమవారం రక్తసిక్తమైంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రంపై ఐఎస్ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో 71మంది మరణించారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రం గేట్లు తెరుచుకున్న వెంటనే పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ దూసుకుపోయి భయానక విస్ఫోటనం సృష్టించాడు. దేశంలోని రెబెల్స్‌పై పోరాటం సాగించేందుకు యెమన్ ప్రభుత్వం భారీ ఎత్తున సైన్యంలోకి యువతను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అడెన్‌లోని ఓ పాఠశాలను కేంద్రంగా చేసుకుని నియామకాలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. ఏకంగా జనం మధ్యలోకే బాంబర్ దూసుకెళ్లిపోయాడని, విస్ఫోటక ప్రభావానికి భవనం కుప్పకూలిపోవడంతో అనేక మంది దాని శిథిలాల కింద పడి మరణించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం 71మంది ఆర్మీ రిక్రూటీలు మరణించారని, మరో 98మంది తీవ్రంగా గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే మృతులందరూ కొత్తగా సైన్యంలో చేరివారానేనా అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, అడెన్‌లో జరిగిన దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

చిత్రం.. ఐఎస్ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో పూర్తిగా శిధిలమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రం