అంతర్జాతీయం

ఆందోళనలో అఫ్గాన్ ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, సెప్టెంబర్ 11: తాలిబన్లతో చర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా వైఖరి కారణంగా దేశంలో మళ్లీ సామాన్య పౌరుల మరణాలు పెరుగుతాయేమోనని అఫ్గానిస్తాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేసింది అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్లతోనే. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గత వారం సంభవించిన పేలుడు శబ్దాలు ఇప్పుడు ప్రజల చెవుల్లో మార్మోగుతున్నాయి. గత వారం ఒక విదేశీ కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు జరిపిన పేలుడులో దానికి బదులుగా అఫ్గాన్ ప్రజల ఇళ్లు చెల్లాచెదురయ్యాయి. దిగ్భ్రాంతికి గురయిన కుటుంబ సభ్యులు రక్తమోడుతున్న శరీరాలతోనే పిల్లలను తీసుకొని చీకటిలో పారిపోయారు. సంవత్సరం క్రితం జరిగిన ఒక దాడిలో ఒక కుటుంబంలోనే 30 మంది బంధువులు గాయపడ్డారు. వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు ఇంకా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ‘శాంతి నెలకొంటుందని మాకు విశ్వాసం ఉండింది’ అని 54 ఏళ్ల ఆ కుటుంబ యజమాని హయత్ ఖాన్ మంగళవారం అన్నారు. ‘అలాంటి దాడి ఇప్పుడు జరగొద్దు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్తాన్‌లో యుద్ధానికి స్వస్తి పలకడానికి ఉద్దేశించిన అమెరికా-తాలిబన్ చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అఫ్గాన్ ప్రజలకు దురదృష్టకరమయినవే. దాదాపు 18 సంవత్సరాలుగా అఫ్గానిస్తాన్‌లో అమెరికాకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది అఫ్గానిస్తాన్ ప్రజలు మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాలిబన్లతో చర్చలను రద్దు చేసుకోవడం వల్ల అఫ్గానిస్తాన్‌లో మరింత మారణకాండ పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా, తాలిబన్లు, అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలు- మూడు కూడా తమ దాడులను తీవ్రం చేస్తాయని ప్రజలు భయపడుతున్నారు. ఏకకాలంలో సాగే ఇరు పక్షా ల కాల్పుల్లో ప్రతి రోజు సామాన్య ప్రజలు చనిపోతారని ఆందోళన చెందుతున్నా రు. అమెరికా 9/11 దాడిలో మృతి చెందిన వేలాది మందికి బుధవారం నివాళి అర్పిస్తున్న తరుణంలో దాడులు, ప్రతి దాడుల మధ్య నలిగిపోయిన అఫ్గానిస్తాన్ ప్రజలు మాత్రం పెరుగుతున్న తమ పౌరుల మరణాలను ప్రస్తావిస్తున్నారు. ‘ఇక్కడ అమాయక ప్రజలు హతమయ్యారు. ఎక్కడ చూసినా రక్తపాతమే. కుటుంబాలు తమ కుమారులను, తల్లులను, పశువులను కోల్పోయాయి. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లే దు’ అని పేలుడులో గాయపడి ఇప్పటికీ తల చుట్టూ బ్యాండేజీతో ఉన్న ఖాన్ అన్నారు.