అంతర్జాతీయం

భారత్‌లో హైటెక్ రంగానికి ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: భారత్‌లో హైటెక్ రంగాలు వచ్చే ఐదేళ్ల కాలంలో సుమారు 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టి అదనంగా మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను సృష్టించగలిగే సమర్థ్యంతో ఉన్నాయని అమెరికాకు చెందిన ‘యూఎస్-ఇండియా స్ట్రేటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం’ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) అధ్యయన నివేదిక వెల్లడించింది. ‘హైటెక్ మాన్యుఫాక్చరింగ్ ఇన్ ఇండియా’ పేరిట రూపొందిన ఆ నివేదికను యూఎస్‌ఐఎస్‌పీఎస్ భారత ప్రభుత్వానికి సమర్పించింది. కాగా భారత్‌లోని హైటెక్ రంగాలు వచ్చే ఐదేళ్ల కాలంలో 5,50,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, కోటి 40 లక్షల పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగివున్నాయని ఆ నివేదిక పేర్కొంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసిక్తిగా ఉన్న అమెరికన్ కంపెనీలు అందజేసిన ఫీడ్‌బ్యాక్ ద్వారా ఈ నివేదికను రూపొందించినట్టు యూఎస్‌ఐఎస్‌పీఎస్ తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్, విమానయానం, వైద్య పరికరాలు వంటి పలు ప్రధాన రంగాలు వచ్చే ఐదేళ్లలో అదనంగా 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టి 5,50,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, కోటి 40 లక్షల పరోక్ష ఉద్యోగాలు ఇవ్వగలిగే సామర్థ్యంతో ఉన్నాయని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు ముఖేష్ అఘి తెలిపారు. ఈ పరిశ్రమలు భారత ప్రభుత్వంతో కలిసి ‘మేకిన్ ఇండియా’ లక్ష్యం మేరకు పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాయని, భారత్‌ను ప్రపంచ స్థాయిలో తయారీ రంగ హబ్‌గా రూపొందించాలన్న తపన ఆ కంపెనీల యాజమాన్యాల్లో వ్యక్తమవుతోందని ఆయన వివరించారు. దేశీయంగా తయారీ రంగంలో వృద్ధి నెలకొంటే తద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంటుందని ఆయన అన్నారు. భారత ఎలక్ట్రానిక్స్, విమానయాన, వైద్య పరికరాల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడిందని, ఐతే ప్రస్తుతం ఈ రంగాల్లో భారత్ అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తి భాగస్వామ్యం కేవలం 3 శాతంగా మాత్రమే ఉందని, దీన్ని గణనీయంగా పెంచుకునే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈ అభిప్రాయాలన్నీ వివిధ అంతర్జాతీయ పరిశ్రమలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తమ ప్రతినిధులు సంప్రదించినపుడు వెల్లడైనవేనని నివేదిక తెలిపింది.