అంతర్జాతీయం

రేపటి నుంచి భారత్‌లో న్యూజెర్సీ గవర్నర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: యావత్ అమెరికాలోనే పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్న న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ మర్ఫీ శుక్రవారం నుంచి పది రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. నూజెర్సీలో పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు మర్ఫీ బుధవారం తెలిపారు. ‘న్యూజెర్సీ చెప్పే అంశాలను భారత్ గట్టిగా.. బలంగా వింటుందని’ ఆశిస్తున్నట్లు భారత్‌కు బయల్దేరడానికి ముందు మర్ఫీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో స్పష్టం చేశారు. 62 సంవత్సరాల మర్ఫీ 1990వ దశకంలో ఆసియాలో నివసించారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమనీ.. తరచు ఆ దేశానికి వెళ్తూ ఉంటానని మర్ఫీ వివరించారు. అయితే, అమెరికాలోని ఒక రాష్ట్ర గవర్నర్‌గా అధికారికంగా పర్యటిస్తున్న వారిలో తాను మొదటి వ్యక్తిగా మర్ఫీ వెల్లడించారు. తాను ఎక్కువగా ప్రేమించే దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. తన పది రోజుల పర్యటనలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో పాటు ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. ఢిల్లీతోపాటు ముంబయి, ఆగ్రా, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో పర్యటించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈనెల 13 నుంచి 22వ తేదీ వరకు భారత్‌లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. న్యూజెర్సీతో ఆర్థిక ఒప్పందాలతో పాటు వ్యాపార వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు, అంతర్జాతీయ పెట్టుబడుల అవకాశాలను బలోపేతం చేయడమే మర్ఫీ పర్యటన ప్రధాన ధ్యేయమని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘న్యూజెర్సీతో భారత్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమనీ.. ముఖ్యంగా తమ రాష్ట్రంలో నంబర్ వన్ విద్యా వ్యవస్థ ఉందనీ.. ప్రతిభకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నామని’ పేర్కొంది. ఆర్థిక, జీవశాస్త్రం, సాంకేతిక, టెలికం రంగాల్లో నూజెర్సీ బలంగా ఉందని చెప్పారు. న్యూజెర్సీలో ఇప్పటికే స్థిరపడిన ప్రఖ్యాత కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ నాలుగు వేల మందికి ఉపాధినిస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లను కలిగి ఉన్న రాష్ట్రం న్యూజెర్సీ అని మర్ఫీ పేర్కొన్నారు. గవర్నర్ కార్యాలయ ప్రకటన ప్రకారం.. మర్ఫీతోపాటు న్యూజెర్సీ ఎకనామిక్ డెవలప్ అథారిటీ (ఎన్‌జేఈడీఏ) సీఈవో టిమ్ సులివన్, సెనేటర్ విన్ గోపాల్, అసెంబ్లీ తరఫున రాజ్ ముఖర్జీ, సెనేటర్ శ్యాం థాంప్స న్, టెక్నాలజీ, ఉన్నత విద్య, ఆరోగ్య, హెల్త్‌కేర్, ఆర్థికాభివృద్ధి, ఇంధన రంగాలకు చెందిన ప్రతినిధులు భారత్‌లో పర్యటించే బృందంలో ఉన్నారు. అమెరికాలో భారత్‌కు చెందిన కంపెనీల ఉద్యోగులు హెచ్1బీ వీసాలపై వస్తున్న ఆందోళనకర ప్రకటనలను ప్రస్తావించగా అది ఫెడరల్ విషయం అని చెప్పారు. వారి ఆందోళనను అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. అయితే, ఇది యావత్ అమెరికాకు సంబంధించిన అంశం అని మర్ఫీ స్పష్టం చేశారు. చర్చ జరుగుతుందన్నారు.