అంతర్జాతీయం

భారత శాంతి దళానికి ఐరాస పతకాల అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 12: దక్షిణ సూడాన్‌లో ఐరాస మిషన్‌లో పనిచేస్తున్న భారత శాంతి పరిరక్షక దళం సభ్యులు 17 మందికి అవార్డులు లభించాయి. ప్రజలకు వారందించిన అమూల్యమైన సేవలను గుర్తించి అవార్డులు ప్రకటించారు. యువభారతానికి చెందిన శాంతి దళం దక్షిణ సూడాన్‌లో ఏడాది పాటు సేవలందించింది. సూడాన్‌లో కమ్యూనిటీ పోలీసింగ్, పౌరుల భద్రత అలాగే స్థానిక పోలీసుల్లో నైపుణ్య అభివృద్ధికి భారత పోలీసులు ఎంతో కృషి చేశారని దక్షిణ సూడాన్‌లోని యూఎన్ మిషన్ వెల్లడించింది.‘ సామాజిక పరివర్తన, సామాజిక అభివృద్ధిలో 17 మంది శాంతి బృందం సభ్యులు అంకిత భావంతో పనిచేశారు. వారి సేవలను గుర్తించి పురస్కారాలు అందించాం. దక్షిణ సూడాన్, స్థానిక పోలీసుల తరఫున వారికి అభినందనలు తెలుపుతున్నాం’అని సంస్థ ట్వీట్ చేసింది. భారతకు చెందిన పురుష, మహిళా పోలీసు అధికారుల సేవలను గురించిన యూఎన్ సర్వీస్ మెడల్స్ అందజేశారు. జూబాలోని ఐరాస మిషన్ హౌస్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పతకాలు ప్రదానం చేశారు. ‘్భరత్ అంటే శాంతి, సుస్థిరతకు పేరు. మా పోలీసు అధికారులు అదే లక్ష్యంతో ఇక్కడ సేవలందించారు’అని దక్షిణ సూడాన్‌లోని భారత రాయబారి ఎస్‌టీ మూర్తి వెల్లడించారు. పతకాల ప్రదాన కార్యక్రమం చిత్రించిన వీడియోను యూఎన్ మిషన్ విడుదల చేసింది. భారత శాంతి పరిరక్షక దళం సేవలు నిరుపమానమని మిషన్ అధిపతి డేవిడ్ షెయారెర్ అన్నారు. భారత దళాన్ని ఆయనీ సందర్భంగా అభినందించారు. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న ఐరాస మిషన్ లో భారత దళం ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. శాంతి దళంలో భారతకు చెందిన బృందం రెండో అతిపెద్దదని స్పష్టం చేశారు. ఐరాస మిషన్ కింద 2,337 దళా లు పనిచేస్తున్నాయి. భారత సైనికాధికారి లెఫ్టినెం ట్ జనరల్ శైలేష్ సదాశివ్ టినైకర్ జూలైలో మిష న్ దళ కమాండర్‌గా బాధ్యత లు స్వీకరించారు. 15,000 మందికి నాయకత్వం వహించారు.