అంతర్జాతీయం

సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 13: పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం ముప్పు పొంచి ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక సీనియర్ భారత దౌత్యవేత్త గురువారం ఇక్కడ ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల చీఫ్ మిషెల్లి బాచెలెట్‌ను కలిసి భారత్ జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి తీసుకున్న చర్యలను వివరించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సెక్రెటరి (ఈస్ట్) విజయ్ ఠాకూర్ సింగ్ గురువారం జెనీవాలో బాచెలెట్‌తో భేటీ అయ్యారు. కాశ్మీర్‌లో ఆంక్షల ప్రభావంపై ఐరాస హైకమిషనర్ (మానవ హక్కులు) తీవ్రమయిన ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని రోజుల తరువాత బాచెలెట్‌తో విజయ్ ఠాకూర్ సింగ్ భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులను క్రమంగా పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యలను సింగ్ ఆమెకు వివరించారని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సందేశంలో తెలిపారు. యూఎన్‌హెచ్‌ఆర్ హైకమిషనర్‌తో భేటీ సందర్భంగా సింగ్ ఆమెకు పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం కారణంగా పొంచి ఉన్న ముప్పుపై భారత్ ఆందోళనను తెలియజేశారని కుమార్ పేర్కొన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 42వ సెషన్‌లో మంగళవారం సింగ్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేస్తున్న ద్వేషపూరిత ప్రచారంపై ధ్వజమెత్తారు.