అంతర్జాతీయం

యుద్ధం తప్పదేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 15: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన భారత్‌తో చర్చల ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెగేసి చెప్పారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధానికి ఎంతైనా ఆస్కారం ఉందని, దీని ప్రభావం ఉపఖండానికే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నదే తమ ఆలోచన అని, అందుకే ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించామని, అన్ని అంతర్జాతీయ వేదికలపైనా కాశ్మీర్ పరిస్థితిని వివరించామని ఆయన తెలిపారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఇటు ఐరాస, అటు ప్రపంచ దేశాలు ఎలాంటి జాప్యం లేకుండా కాశ్మీర్‌పై సరైన చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ డిమాండ్ చేశారు. భారతదేశంతో యుద్ధం జరిగేందుకు ఎంతైనా అవకాశం ఉందన్న విషయాన్ని తాను నమ్ముతున్నానని ఆయన వెల్లడించారు. ఇదే జరిగితే మాత్రం దాని ప్రభావం, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. అయితే, తనంతట తానుగా పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని మొదలెట్టదని పేర్కొన్న ఆయన ‘యుద్ధాల వల్ల ఏ సమ్యస్యా పరిష్కారం కాదు. నిజానికి నేను యుద్ధానికి వ్యతిరేకిని’ అని అల్‌జజీరా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ స్పష్టం చేశారు. అణ్వాయుధ శక్తి కలిగిన రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైతే అది అంతిమంగా అణు యుద్ధానికి దారితీసేందుకూ ఎంతైనా అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. నిజానికి అలాంటి పరిస్థితిని ఊహించలేమని, తాము మాత్రం సాంప్రదాయక పోరాటానే్న సాగిస్తున్నామని, అందుకే నష్టపోతున్నామని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితులు దీర్ఘకాలం ఎదుర్కొనే అవకాశం ఉండదని పేర్కొన్న ఆయన ‘ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తే లొంగైనా పోవాలి లేదా తుది శ్వాస వరకు స్వాతంత్య్రం కోసం పోరాటాన్నైనా సాగించాలి’ అని అన్నారు. కాశ్మీర్‌క ప్రత్యేక హోదా రద్దయినప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు తీవ్రమవుతూనే వస్తున్నాయి. భారత్‌తో దౌత్య సంబంధాల స్థాయి కూడా పాక్ తగ్గించింది. భారత హైకమిషనర్‌ను బహిష్కరించింది. ఇటీవలివరకు కూడా భారత్‌తో చర్చలు జరిపి సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకుందామని తాము భావించామని, నాగరికత కలిగిన ఇరుగుపొరుగు దేశాలుగా కలిసి జీవించాలని కోరుకున్నామని ఇమ్రాన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ భారత్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్న ఆయన ‘మమ్మల్ని ఆర్థికంగా దివాళా తీయించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఆర్థిక కార్యాచరణ టాస్క్ఫోర్స్‌లో (ఎఫ్‌ఏటీఎఫ్) మమ్మల్ని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్రయత్నించింది. దాని నుంచి మేము బయటపడ్డాం’ అని ఇమ్రాన్ అన్నారు. దీన్నిబట్టి చూస్తే పాకిస్తాన్‌ను సంక్షోభంలోకి నెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్న విషయం స్పష్టమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.