అంతర్జాతీయం

కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 15: కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులను తొలగించి శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని, విద్యార్థులు మళ్లీ పాఠశాలలకు వెళ్ళే పరిస్థితులు కల్పించాలని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, పాకిస్థాన్ విద్యా హక్కుల సామాజిక కార్యకర్త మలాలా యూసుఫ్‌జాహి ఐక్యరాజ్య సమితిని కోరారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే గత నెల 5 నుంచి కాశ్మీర్‌లో అనేక పాఠశాలలు, దుకాణాలు తెరుచుకోలేదని, ప్రజా రవాణా నిలిచి పోయిందని మలాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 40 రోజులుగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థినులు ఇంటి నుంచి బయటకు రావడానికి చాలా భయపడుతున్నారని ఆమె తెలిపారు. దుకాణాలు మూసి ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదని, వ్యాపారులూ నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ల్యాండ్ లైన్ ఫోన్లు, ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపి వేయడం వల్ల ప్రజా సంబంధాలు తెగిపోయాయని మలాలా తెలిపారు. కాబట్టి విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళేలా, దుకాణాలు తెరుచుకుని సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని కోరారు.