అంతర్జాతీయం

‘పెద్దపులి’ బతికే ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 29: గెరిల్లా యుద్ధతంత్రం, ఆత్మాహుతి దాడులతో ఒకప్పుడు శ్రీలంకను గడగడలాడించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) వ్యవస్థాపక అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నాడా? శ్రీలంకలోని కొంత మంది తమిళ జాతీయులు అవుననే అంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఆఫీస్ ఆఫ్ ద మిస్సింగ్ పర్సన్స్’కి ప్రభాకరన్ పేరు తెలియజేయాలని అనుకుంటున్నానని ఒక తమిళ జాతీయుల కూటమి నాయకుడు ఎం.శివాజిలింగం తెలిపారు. నార్తర్న్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడయిన శివాజిలింగం స్థానిక రేడియో స్టేషన్‌కు ఈ విషయం చెప్పారు. ప్రభాకరన్ అదృశ్యమైనట్లు ఆయన సోదరి లేదా సోదరుడు ఒఎంపికి ఫిర్యాదు చేయాలనుకుంటే వారి తరపున ముందుకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని శివాజిలింగం చెప్పారు. శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక దేశం కోసం పోరాటం చేసిన ప్రభాకరన్ (54) ఉత్తర ముల్లయితీవు జిల్లాలోని ముల్లయివైక్కల్‌లో 2009 మే 19న ప్రభుత్వ బలగాల చేతిలో హతమయ్యాడని శ్రీలంక ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఎల్‌టిటిఇలో పనిచేసి లొంగిపోయిన వేలాది మంది ప్రభాకరన్ మృతదేహాన్ని గుర్తుపట్టారు. అయితే కొంతమంది మాత్రం ఆ వాదనను విశ్వసించడం లేదు.