అంతర్జాతీయం

ఓ కీలక ప్రకటన చేయొచ్చు: ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 19:. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్న ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ఓ కీలక ప్రకటన చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హోస్టన్‌లో ఆదివారం దాదాపు 50 వేల మంది హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 22న జరిగే ఈ కార్యక్రమానికి భారత్ పట్ల ప్రత్యేక అభిమానంతో ట్రంప్ హాజరవుతారని వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక వ్యాపార బంధానికి, సాన్నిహిత్యానికి కూడా ట్రంప్ నిర్ణయం అద్దం పడుతుందని వైట్‌హౌస్ తెలిపింది. మోదీ, ట్రంప్ ఒకే వేదికపై కలవడం అన్నది ఇదే మొదటిసారి. గత మూడు నెలల కాలంలో వివిధ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నప్పటికీ ప్రత్యేకంగా ఒకే వేదికపై మాట్లాడటం అన్నది ఇదే ప్రథమం. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతూ మధ్యలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ హోస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రత్యేక ప్రకటన చేయబోతున్నారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినా, కొన్ని సంకేతాలు మాత్రం అందించారు. కాగా, ఈ సమావేశానికి సంబంధించి ఇరుదేశాల నేతల మధ్య వాణిజ్య పరమైన ఒప్పందాలు కుదిరేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలకు సంబంధించి ఇప్పటికే ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.