అంతర్జాతీయం

టెక్సాస్‌లో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, సెప్టెంబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే వేదికను పంచుకోనున్న హౌడీ మోడీ భారీ కార్యక్రమం మరో రెండు రోజుల్లో జరుగనున్న తరుణంలో ఈ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మరణించారు. ఇమెల్‌దా అనే వాయుగుండం టెక్సాస్‌ను తాకడంతో భారీ ఎత్తున కుంభవృష్టి కురిసింది. వరదలు ముంచెత్తాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు బయటకు రావద్దంటూ పౌరులను హెచ్చరించారు. 13 ప్రాంతాల్లో ఎమర్జన్సీ విధిస్తున్నట్టు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ హౌడీ మోడీ కార్యక్రమాన్ని అనుకున్నట్టుగానే నిర్వహిస్తామని వలంటీర్లు చెబుతున్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న 50 వేల మంది ఇండో అమెరికన్ పౌరులు అనుకున్నట్టుగానే ఎన్‌ఆర్‌జీ స్టేడియానికి తరలి రాగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమా న్ని అనూహ్యరీతిలో విజయవంతం చేసేందుకు 1500 మంది కార్యకర్తలు అహోరాత్రులు పనిచేస్తున్నారని అచలేష్ అమర్ అనే ఓ నిర్వాహకుడు తెలిపారు. అమెరికాలో భారతీయుల శక్తి, పరిమాణం, భిన్నరంగాల్లో వారు సాధిస్తున్న విజయానికి హౌడీ మోడీ కార్యక్రమం అద్దం పడుతుందని ఆయన తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అమెరికా ప్రభుత్వానికి చెందిన గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు కూడా ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఎంత ఘన విజయం సాధిస్తే అమెరికాలో ఉంటున్న భారతీయుల సత్తా అంతగానూ ఇనుమడిస్తుందని ఆయన తెలిపారు.