అంతర్జాతీయం

మయన్మార్‌కు అండగా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దశాబ్దాల తరబడి కొనసాగిన సైనిక పాలన నుంచి బయటపడి సరికొత్త మార్గంలో పయనించేందుకు సిద్ధమైన మయన్మార్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని భారత్ భరోసా ఇచ్చింది. మయన్మార్ అధ్యక్షుడు యు హిన్ క్యావ్‌తో సోమవారం న్యూఢిల్లీలో జరిపిన విస్తృత చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ హామీ ఇచ్చారు. ప్రముఖ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డి (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ) పార్టీ మయన్మార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. ద్వైపాక్షి సంబంధాలను మరింత బలోపేతం చేసుకుని, ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాధినేతలు ఈ భేటీలో నిశ్చయించుకున్నారు. మయన్మార్ ఆంతరంగిక శాంతి ప్రక్రియకు భారత్ పూర్తి అండగా నిలుస్తుందని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంధాయకత (కనెక్టివిటీ), వైద్య, పునర్వినియోగ ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాలు ఈ సమావేశంలో మూడు అవగాహనా ఒప్పందాలను (ఎంఓయులను) కుదుర్చుకోవడంతో పాటు విద్యుత్, బ్యాంకింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. అనంతరం మయన్మార్ అధ్యక్షుడితో కలసి మోదీ ఈ సమావేశ వివరాలతో కూడిన ప్రకటనను మీడియాకు చదివి వినిపిస్తూ, పరస్పర భద్రతా ప్రయోజనాలను భారత్, మయన్మార్ గుర్తించాయని, ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడాలని ఇరు దేశాలు నిశ్చయించుకున్నాయని తెలిపారు. మయన్మార్ సరిహద్దు వెంబడి గల నాగాలాండ్, మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాలను చాలా కాలం నుంచి తీవ్రవాద సమస్య వేధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చిత్రం.. మయన్మార్ అధ్యక్షుడు యు హిన్ క్యావ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ