అంతర్జాతీయం

వీసా లేకుండా ఉజ్బెకిస్తాన్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: వీసా లేకుండానే భారతీయులను తన దేశానికి త్వరలోనే అనుమతిస్తామని ఉజ్బెకిస్తాన్ రాయబారి ఫర్హద్ అర్జీస్ వెల్లడించారు. హైదరాబాద్ నగర అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం సిటీకి వచ్చారు. ఈ మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫర్హోద్ మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్‌ను సందర్శించే భారతీయుల కోసం ఇప్పటికే ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ఇప్పటికే భారత్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నట్లు తెలిపారు. ఉజ్బెకిస్తాన్‌కు రెండున్నర వేల సంవత్సరాల చరిత్ర ఉందని.. హైదరాబాద్ సిటీ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన సిటీ అయినందున ఈ రెండు నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. సంస్కృతి, పర్యాటకం, వర్తక, వ్యాపారం వంటి అనేక అంశాలను ఈ ఒప్పందంతో షేర్ చేసుకోనున్నట్లు తెలిపారు. ఉజ్బెకిస్తాన్, భారత్‌ల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా దౌత్య సంబంధాలున్నాయని, ఇందుకు తాస్కెంట్ ఒప్పందం నిదర్శనమని వివరించారు. హైదరాబాద్‌తో ఉజ్బెకిస్తాన్‌లో రెండున్నర వేల సంవత్సరాల చరిత్ర కల్గిన బోహ్రా నగరాల మధ్య ఈ సిస్టర్ సిటీ ఒప్పందాన్ని త్వరలోనే చేసుకోనున్నట్లు తెలిపారు. నగరంలోని సినీ పరిశ్రమను కూడా ఉజ్బెకిస్తాన్‌కు ఆహ్వానిస్తున్నామని, ఉజ్బెక్‌లో ఎన్నో ఆకర్షణీయ, చారిత్రక కట్టడాలున్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉజ్బెక్‌కు చెందిన ఎంతో మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ ఉజ్బెక్ రాయబారిని ఫర్హోద్‌కు జ్ఞాపికను బహూకరించి, సన్మానించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను రాయబారికి చూపించి, అక్కడి నుంచి వర్షాలు కురిసినపుడు, ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించే విధానాన్ని మేయర్ వివరించారు.