అంతర్జాతీయం

మసూద్ అజర్‌పై రెడ్ కార్నర్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కరడుగట్టిన ఉగ్రవాది, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం) అధినేత వౌలానా మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోమవారం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. పఠాన్‌కోట్‌లోని వ్యూహాత్మక భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి కుట్ర పన్ని, అమలు చేశారనే అభియోగంపై అజర్, మరో ముగ్గురు ఉగ్రవాద నాయకులపై ఎన్‌ఐఎ ఈ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అంతకుముందు, అజర్‌సహా ఈ నలుగురు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేయించడంలో ఎన్‌ఐఎ విజయం సాధించింది. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కేసులో మసూద్‌తో పాటు అతని సోదరుడు అసద్ రవూఫ్, కాసిఫ్ జాన్, షాహిద్ లతీఫ్‌లకు వ్యతిరేకంగా అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలు, వారి తల్లిదండ్రుల వివరాలు, వారి చిరునామాలు, వారికి, దాడి సూత్రధారులయిన జెఇఎం నాయకులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు సహా పక్కా ఆధారాలను ఎన్‌ఐఎ సమర్పించడంతో కోర్టు ఆ నలుగురికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది.
పార్లమెంటుపై, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీపై జరిగిన దాడి కేసులో దాడికి కుట్రదారు అయిన అజర్‌కు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. 1999 నాటి ఐసి-814 విమానం హైజాకింగ్ కేసులో రవూఫ్‌కు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు కూడా పెండింగ్‌లో ఉంది.
ఐక్యరాజ్య సమితి అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అతనిపై నిషేధం విధించడానికి వీలుగా భారత్ చేసిన గట్టి ప్రయత్నాలను చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంది. గత వారం ఐరాస ఆంక్షల కమిటీ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా నిరోధించింది.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై ఐరాస చేత నిషేధం విధింపచేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఐరాస 2001లోనే జెఇఎంపై నిషేధం విధించింది. అయితే 2008లో ముంబయిపై ఉగ్రవాదుల దాడి తరువాత ఐరాసచేత అజర్‌పై ఆంక్షలు విధింపచేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలను కూడా చైనా అడ్డుకుంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న చైనా ఐరాసలో తన వీటో అధికారాన్ని ఉపయోగించుకొని భారత్ ప్రయత్నాలకు గండి కొట్టింది.