అంతర్జాతీయం

కలిసి కట్టుగా సాగుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దక్షిణ ఆసియా దేశాలు మెజారిటీ, మైనారిటీ మనస్థత్వాన్ని విడనాడాలని భిన్నత్వంలో ఏకత్వమే ఈ ప్రాంత బలమని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన భారత శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన హసీనా స్నేహం, సహకారం ద్వారానే ఈ ప్రాంత దేశాలు తమ భౌగోళిక, రాజకీయ వాస్తవాలను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. స్వల్ప లాభాల కోసం దీర్ఘకాల ప్రయోజనాలను వదులుకోకూడదని స్పష్టం చేసిన ఆమె ‘దక్షిణాసియా అత్యంత శక్తివంతమైనదిగా, సహకారంతో కూడుకున్న దేశాల కూటమిగా ఎదగాలి, ఇతర ప్రాంతాలతో సంబంధాలు పెంపొందించుకునేందుకు సంసిద్ధంగా ఉండాలి’ అని అన్నారు. ఈ ఫోరంలో జరిగిన చర్చలో సింగపూర్ ఉప ప్రధాని హెంగ్ స్వీకీట్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా సార్క్, బింబెమ్‌స్టిక్‌తో సహా అనేక ప్రాంతీయ కూటములతో బంగ్లాదేశ్ కలిసి పని చేస్తున్నదని హసీనా గుర్తు చేశారు. ఈ ప్రాంత దేశాలు ఎంతగా సహకరించుకుంటే వాణిజ్యపరంగా, ఇతరత్రా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. శాంతి, సుస్థిరత, సామరస్యమే ప్రాతిపదికగా ఈ ప్రాంత దేశాలు ముందుకు సాగాలని మెజారిటీ, మైనారిటీ మనస్థత్వాన్ని వదులుకోవాలన్నారు. ప్రాంతీయంగా భాషాపరంగా వారసత్వపరంగా దక్షిణాసియాకు ఉన్న వైవిధ్యాన్ని ఇక్కడి దేశాలన్నీ పరిరక్షించుకోవాలని, అలాగే అసమానతలను తొలగించాలని ఆమె ఉద్ఘాటించారు. సంపద సృష్టి అన్నది అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని, సమాజంలో అట్టడుగు స్థాయికి కూడా ఈ ఫలాలు అందలన్నారు.