అంతర్జాతీయం

మాస్క్‌లు ధరించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 5: ముఖాలకు మాస్క్‌లు ధరించరాదన్న హాంగ్‌కాంగ్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ, బాజాప్తా మాస్క్‌లు ధరించి ఆందోళనలకు దిగారు. దీంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారులపై వాణిజ్య, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. నిరసనకారులు విధ్వంసాలకు పాల్పడకుండా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మాస్క్‌లు ధరించడం వల్ల నేరాలు-ఘోరాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఓ అధికారి వెల్లడించారు. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ప్రజలు ఆందోళనలకు దిగారు. శనివారం వందలాది మంది నిరసనకారులు మాస్క్‌లు ధరించి ధర్నాలు నిర్వహించారు. పేరేన్నికగన్న షాపింగ్ జిల్లాలోని కాజ్‌వే బే లో నిరసనకారులు ఆందోళనలకు దిగారు. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచి పోయింది. నిరసనకారులు ఎటువంటి విధ్వంసాలకు దిగినా కఠినంగా అణిచి వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. కాజ్‌వే-బేలో మాస్క్‌లు ధరించిన నిరసనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనతో నగరంలోకి ప్రవేశించే అన్ని రహదారులు దాదాపు మూతపడ్డాయి. అంటే నగరంలోకి ప్రవేశించేందుకు వీలు లేనంతగా వాహనాలతో, ప్రజలకు అంతరాయం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని, మాస్క్‌లు ధరించేందుకు ప్రజలకు స్వేచ్చ ఉందని నిరసనకారులు వాదిస్తున్నారు.
ఇలాఉండగా మంగళవారం చైనా 70 ఏళ్ళ కమ్యూనిస్టు పార్టీ పాలనను పూర్తి చేసుకున్న ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో హాంగ్‌కాంగ్‌లో ఘోరమైన అల్లర్లు జరిగాయి. పోలీసు జరిపిన దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృత్యువాతపడ్డాడని ప్రజలు విధ్వంసానికి దిగారు. పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో ఆ యువకుడు మరణించినట్లు ప్రజలు వాదిస్తుండగా, బుల్లెట్‌తో మరణించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కారులో పెట్రోల్ బాంబు పేరిందని పోలీసులు అంటున్నారు. ఇలా హాంగ్‌కాంగ్ అట్టుడుకడంతో షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బ్యాంకులు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించింది. అయితే పరిస్థితి చేయి దాటకుండా పోలీసు అధికారులు ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.