అంతర్జాతీయం

హాంకాంగ్‌లో మళ్లీ భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, అక్టోబర్ 6: హాంకాంగ్‌లో ఆదివారం ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. హాంకాంగ్‌లోని సగం సబ్‌వే స్టేషన్లు మూసి ఉన్నప్పటికీ, ముఖాలకు మాస్కులు ధరించరాదని ఉన్న ఆంక్షలను ధిక్కరిస్తూ ఆదివారం వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. ముందస్తు అనుమతి తీసుకోకుండానే పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు భారీ వర్షంలో ఆదివారం మధ్యాహ్నం విక్టోరియా హార్బర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. రహదారులను దిగ్బంధించిన, కనీసం మూడు ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హాంకాంగ్‌లో ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులు తరచుగా అకస్మాత్తుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారిలో కొంతమంది సబ్‌వే స్టేషన్లను, షాపులను ధ్వంసం చేస్తున్నారు. ముఖాలకు ముసుగులు ధరించి ర్యాలీలు తీయరాదని హాంకాంగ్ అధికారులు ఆదేశాలు జారీ చేసిన తరువాత ఇలాంటి ర్యాలీలు ఎక్కువయ్యాయి. ముఖాలకు ముసుగులు ధరించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ప్రజాస్వామ్య అనుకూల చట్టసభ సభ్యులు ఆదివారం ఉదయం హైకోర్టును ఆశ్రయించారు. ఇలా నిషేధం విధించడం చట్టసభ అధికారాలను హరించడమేనని, నగర మినీ-రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వారు వాదించారు. అయితే, ఒక సీనియర్ న్యాయమూర్తి వారి పిటిషన్‌ను కొట్టివేశారు. ప్రజలకు ప్రమాదం సంభవించే పరిస్థితులు నెలకొన్నప్పుడు చైనా అనుకూల నగర నాయకురాలు కేరీ లామ్‌కు ఎలాంటి ఆంక్షలయినా విధించే అధికారాన్ని చట్టం కల్పించిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.