అంతర్జాతీయం

కాశ్మీర్ మా రక్తంలో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 7: పాకిస్తాన్ క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ అడుగుబెట్టే సంకేతాలు అందిస్తున్న మాజీ సైనిక నియంత ముషారఫ్ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కాశ్మీర్ అన్నది పాకిస్తాన్ రక్తంలోనే ఉన్నదని, కాశ్మీర్ ప్రజలకు తమ సైన్యం అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ముషారఫ్ కార్గిల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్ ఎంతగా శాంతి ప్రయత్నాలు చేస్తున్నా భారత్ తమ ప్రజలను తరచూ రెచ్చగొడుతున్నదని అన్నారు. కార్గిల్ యుద్ధాన్ని భారత్ సైన్యం మరచిపోయి ఉండవచ్చునేమోనని ఆయన వ్యాఖ్యానించారు. 1999లో కార్గిల్ యుద్ధాన్ని ఆపేందుకు అప్పటి అధ్యక్షుడు సాయాన్ని భారత్ కోరిన విషయాన్ని ముషారఫ్ గుర్తు చేశారు. దుబాయ్ నుంచి ఆయన అఖిల పాకిస్తాన్ ముస్లీంలీగ్ కార్యకర్తలనుద్ధేశించి టెలిఫోన్‌లో మాట్లాడారు. ఏదిఏమైనా తాము కాశ్మీర్ ప్రజలకు అండగా నిలుస్తామని, కాశ్మీర్‌ను తమ నుంచి ఎవరూ విడదీయలేరని ముషారఫ్ స్పష్టం చేశారు. తమ చివరి రక్తపు బొట్టు వరకు పాకిస్తాన్, అలాగే పాక్ సైన్యం పోరాటాన్ని కొనసాగిస్తాయని అన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నంత మాత్రాన దానిని బలహీనతగా భావించకూడదని ముషారఫ్ హెచ్చరించారు. భారత దేశం ఎలాంటి దుస్సాహాసానికి పాల్పడినా దానిని తగిన రీతిలో ఎదుర్కొవడానికి పాక్ సైనికు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు.