అంతర్జాతీయం

రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోర్డెక్స్ (ఫ్రాన్స్), అక్టోబర్ 9: రాఫెల్ యుద్ధ విమానాలతో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. యుద్ధానికి కాలుదువ్వబోమని, దాడులకు పాల్పడబోమని దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ తరఫున స్వీకరించిన ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2021 సంవత్సరం ఫిబ్రవరి నాటికి 18 రాఫెల్ విమానాల డెలివరీ పూర్తవుతుందని ఆయన తెలిపారు. 2022 నాటికి ఒప్పందం ప్రకారం మొత్తం 36 యుద్ధ విమానాలను దస్సాల్ట్ సంస్థ భారత్‌కు పంపుతుందని ఆయన తెలిపారు. విమానాన్ని స్వీకరించిన తర్వాత ఆయన సహస్ర పూజను నిర్వహించారు. విమానంపై ఓంకారాన్ని దిద్దారు. కొబ్బరికాయ కొట్టి, పూలు జల్లి పూజాది కార్యక్రమాలను పూర్తి చేశారు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం దస్సాల్ట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఆత్మరక్షణకు మాత్రమేనని 68ఏళ్ల రాజ్‌నాథ్ సింగ్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ కొత్త యుద్ధ విమానాల్లో ప్రయాణం చేయడం కొత్త అనుభూతిని మిగిల్చిందని వ్యాఖ్యానించారు. గతనెల 19న హెచ్‌ఏఎల్ బెంగళూరు విభాగంలో తయారు చేసిన తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల్లో ఆయన ప్రయాణించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఓ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత రక్షణ మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. దేశవాళీ విమానాలతో పాటు మరింత ఎక్కువ సామర్ధ్యం కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు కూడా దేశానికి అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ విమానాల రాకతో భారత రక్షణ వ్యవస్థ బలోపేతం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. మధ్య తరహా యుద్ధ విమానాల కోవకు చెందిన రాఫెల్ జట్‌లతో వివిధ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. వైమానిక దాడుల సందర్భంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాఫెల్ అంటే వాయువేగం అనే అర్థం వస్తుందని ఫ్రెంచ్ అధికారులు తనకు తెలిపారని అన్నారు. పేరుకు తగ్గట్టుగానే రాఫెల్ యుద్ధ విమానాలు మెరుపువేగంతో దాడులు చేయగలుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. రాఫెల్ ఒప్పందం ద్వారా భారత్, ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించడం ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని రాజ్‌నాథ్ అన్నారు. రాఫెల్ నుంచి 59,000 కోట్ల రూపాయల విలువైన 36యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబర్‌లో భారత్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2022 సెప్టెంబర్ నాటికి విమానాలు భారత్‌కు అందజేయాలి. అందులో భాగంగానే తొలి విమానాన్ని రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా స్వీకరించారు.

*చిత్రం... పారిస్‌లోని సఫ్రాన్ సంస్థలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన యువ ఇంజనీర్లతో రాజ్‌నాథ్ సింగ్