అంతర్జాతీయం

టొకర్జక్, హాండ్కేకు సాహిత్యంలో నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్: పోలాండ్ నవలా రచయిత్రి ఓల్గా టొకర్జక్, ఆస్ట్రియా నవలాకారుడు, నాటక రాచయిత పీటర్ హాండ్కేకు వరుసగా 2018, 2019 సంవత్సరాలకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. నిజానికి టొకర్జక్‌ను గత ఏడాదే ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ నోబెల్ పురస్కారాలను నిలిపివేశారు. దీనితో ఆమెకు ఈ ఏడాది నోబెల్‌ను అందచేశారు. ఈ ఏడాదికి నోబెల్‌ను హాండ్కే దక్కించకున్నారు. విలక్షణ రచయిత్రిగా పేరు సంపాదించిన టొకర్జక్ రచనలు సమకాలీన జీవితాలకు, జీవన వైరుధ్యాలకు అద్దం పడతాయి. ఆమె నవలలు ప్రతి పాత్రను సప్తవర్ణాలతో మన కళ్ల ముందు ఆవిష్కరింప చేస్తాయి. అనుభవాలు నేర్పే పాఠాలు ఆమె రచనల్లో కనిపిస్తాయని, సాహితీ రంగానికి ఆమె ఎనలేని సేవలు అందించారని నోబెల్ అకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. హండ్కే కూడా ప్రపంచ సాహితీ రంగంపై తనదైన ముద్ర వేశారు. జీవితంలో ఎదురైన అనేకానేక సంఘటనలు, వాటి పర్యవసానాలతోపాటు, నిరంతర అనే్వషణ, పరిశోధన, ఆవిష్కరణలు ఆయన రచనల్లో ప్రముఖంగా దర్శనమిస్తాయి. జీవన సారాన్ని కాచివడబోసినట్టు ఆయన సృష్టించిన పాత్రలు కనిపిస్తాయి. ఆయన ప్రతిభకు గుర్తింపుగా నోబెల్ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అకాడెమీ పేర్కొంది. ఈ అవార్డు కింద వీరిద్దరికీ చెరి 912000 యూఎస్ డాలర్లు (828000 యూరోలు లేదా రూ.6,47,98,000) పురస్కారం లభిస్తుంది. 1901లో ప్రారంభమైన సాహితీ రంగం పురస్కారాలు ఇంత వరకూ 116 మందికి లభించాయి.
*చిత్రాలు.. ఓల్గా టొకర్జక్ * పీటర్ హాండ్కే