అంతర్జాతీయం

మైత్రికి దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్ / న్యూఢిల్లీ, అక్టోబర్ 10: భారత్-చైనాల మధ్య మరో శిఖరాగ్ర భేటీకి రంగం సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలు తమిళనాడులోని మామల్లాపురంలో శుక్రవారం కీలక సమావేశం జరపనున్నారు. వీరిద్దరి మధ్య ముఖాముఖి భేటీ జరగడం ఇది రెండోసారి. చారిత్రక, ప్రస్తుత విభేదాలకు అతీతంగా ముందుకు వెళ్లి సహకార బంధాన్ని బలోపేతం చేసుకోవడం పైనే వీరిద్దరూ దృష్టిపెట్టనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శుక్రవారం బీజింగ్ నుంచి బయల్దేరనున్నారు. ఆయన మధ్యాహ్నానికి శిఖరాగ్ర భేటీకి వేదికైన మామల్లాపురం చేరుకొంటారు. ఈ సమావేశం అనుకొన్న ఫలితాలను సాధించేందుకు వీలుగా ఇరు దేశాల అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ‘శిఖరాగ్రం సఫలం కావడానికి బలమైన పునాదులు వేశాం.. జిన్‌పింగ్ భారత పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుంది.. తదుపరి ద్వైపాక్షిక బంధానికి, అనుకొన్న ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తుంది’ అని చైనా ఉప విదేశాంగ మంత్రి లువో ఝావోహుయ్ అన్నారు. అయితే, ఇది ఇరువురు నేతల మధ్య జరిగే లాంఛన సమావేశం కాబట్టి.. స్వేచ్ఛాయుతంగా ఆహ్లాదకర వాతావరణంలో మోదీ-జిన్‌పింగ్‌లు మాట్లాడుకొనే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, ఈ సమావేశం సందర్భంగా అధికారికంగా కూడా ఎలాంటి ఒప్పందాలు కుదిరే అవకాశం లేదన్నారు. శుక్రవారం సాయంత్రం అనువాదకుల సమక్షంలో మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య పలుమార్లు చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై వీరు తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. కాశ్మీర్ ప్రత్యేక హోదాను మోదీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో పాక్ ప్రతికూల ప్రచారానికి చైనా మద్దతు ఇవ్వడం అనంతరం భారత్-చైనాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులే ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో జరుగుతున్న తాజా భేటీ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందేనని ఆ దేశ అధికార పత్రిక ‘చైనా డైలీ’ తన సంపాదకీయంలో పేర్కొంది. మొదట్లో కొంత ప్రతికూల ధోరణిని కనబర్చినప్పటికీ కాశ్మీర్‌పై భారత నిర్ణయం విషయంలో చైనా కొంతమేర తగ్గడం శుక్రవారం జరిగే చర్చల సాఫల్యతకు దోహదం చేయవచ్చన్న సంకేతాలు వ్యక్తవౌతున్నాయి.

*చిత్రం...చెన్నైలో గురువారం జిన్‌పింగ్ మాస్కులు ధరించి, భారత-చైనా పతాకాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు