అంతర్జాతీయం

మదర్ థెరిస్సా ఇక సెయింట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ/ కోల్‌కతా, సెప్టెంబర్ 3: మదర్ థెరిస్సా.. అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. క్రైస్తవులే కాక ఆమెను అభిమానించే వారిలో లక్షలాది మంది క్రైస్తవేతరులూ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలో నిర్వహించే కార్యక్రమంలో మదర్ థెరిస్సాను దేవతగా ప్రకటించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వాటికన్ సిటీకి చేరుకున్న లక్షలాది మంది థెరిస్సా అభిమానుల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగనుంది. మదర్ థెరిస్సా సామాజిక సేవలో నిమగ్నమయింది, పరమపదించింది కోల్‌కతాలో. అందువల్ల భారత్‌నుంచి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మందితో కూడిన ఒక కేంద్ర ప్రతినిధుల బృందం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలో మరో రెండు రాష్ట్ర ప్రతినిధి బృందాలు వాటికన్ సిటీలో జరిగే మదర్ థెరిస్సా ‘దైవత్వ కల్పన’ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. నోబెల్ బహుమతి గ్రహీత అయిన మదర్ థెరిస్సాకు ఉన్న విశేష ప్రాచుర్యం, జనాదరణ వల్ల రోమ్‌లోని వాటికన్ సిటీలో జరిగే కార్యక్రమానికి ఒక విశ్వవ్యాప్త ప్రత్యేకత ఉందని థెరిస్సా స్థాపించిన మిషనరీలలో సేవలందిస్తున్న నన్‌లు తెలిపారు.
మిషనరీస్ ఆఫ్ చారిటి సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరి ప్రేమ నేతృత్వంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని మిషనరీలలో పనిచేస్తున్న 40 నుంచి 50 మంది నన్‌లతో కూడిన ఒక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. కోల్‌కతా ఆర్చ్‌బిషప్ థామస్ డిసౌజాతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 45 మంది బిషప్‌లు ఇప్పటికే వాటికన్ సిటీకి చేరుకున్నారు.
నాలుగున్నర దశాబ్దాల పాటు కోల్‌కతా వీధుల్లో పేదలకు, రోగులకు, అనాథలకు సేవలందించిన మదర్ థెరిస్సాను సెయింట్‌గా ప్రకటించనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరం మార్చిలో వెల్లడించారు. కోల్‌కతాలోని మదర్ హౌస్‌వద్ద ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. మదర్ థెరిస్సాను సెయింట్‌గా ప్రకటిస్తున్న సందర్భంగా మదర్ హౌస్ వద్ద నిర్వహించే వేడుకల్లో అనేక మంది పేదలతో కలిసి నన్‌లు పాల్గొంటారు.
సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటిది బీటిఫికేషన్, రెండోది కాననైజేషన్. 2003లో అప్పటి పోప్ జాన్‌పాల్-2 వేగవంతమైన ప్రక్రియ ద్వారా మదర్ థెరిస్సా ‘బీటిఫికేషన్’ నిర్వహించారు. 2002లో థెరిస్సా సాధించిన రెండు అద్భుతాలను వాటికన్ సిటీ అధికారికంగా గుర్తించింది. సెయింట్ కావాలంటే ఏ వైద్యులూ నయం చేయని వ్యాధిని ప్రార్థనల ద్వారా నయం చేసి ఉండాలి. థెరిస్సా ఇలా అద్భుతంగా నయం చేసిన రెండు కేసులను ఆమె మరణానంతరం వాటికన్ సిటీ గుర్తించడంతో ఆమెను సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియ మొదలయింది