అంతర్జాతీయం

బ్రిటన్‌లో గాంధీ స్మారక నాణెం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 11: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బ్రిటన్ ప్రభుత్వం ఒక స్మారక నాణేన్ని విడుదల చేయనుందని దేశ ఆర్థిక మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. ఈ స్మారక నాణేన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నం కావాలని తాను ఇప్పటికే దేశ రాయల్ మింట్‌ను ఆదేశించినట్టు పాకిస్తాన్ సంతతికి చెందిన జావిద్ వెల్లడించారు. ఇలా స్మారక నాణేన్ని తీసుకు రావడం వల్ల ప్రపంచం తనకు గాంధీ ఏమి బోధించారనే విషయాన్ని ఎన్నటికీ మరచిపోజాలదని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌లోని దక్షిణాసియా సంతతికి చెందిన ప్రభావశీలురయిన సభ్యుల గౌరవార్థం గురువారం ఇక్కడ నిర్వహించిన జీజీ2 నాయకత్వ అవార్డుల కార్యక్రమంలో జావిద్ మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. గాంధీజీ ప్రపంచానికి ఏమి బోధించారనే విషయాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.