అంతర్జాతీయం

సరిహద్దు సమస్య పరిష్కారానికి నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, అక్టోబర్ 11: ప్రపంచ శాంతికి విశేషంగా కృషి చేస్తున్న ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌కు నోబెల్ పురస్కారం లభించింది. ఇరిట్రియాతో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించడమేగాక, ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడంలో కీలక పాత్ర పోషించిన అబీని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్టు నార్వేకు చెందిన నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో ఇథియోపియా ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన అనేకానేక సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశ రూపురేఖలను మార్చేశారని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ చైర్‌పర్సన్ బెరిట్ రిస్-ఆండర్సెన్ వ్యాఖ్యానించారు. నిజానికి ఇంత తక్కువ వ్యవధిలోనే నోబెల్ శాంతి పురస్కారం ఎవరికీ దక్కదని, కానీ, అబీ తీసుకొచ్చిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకుంటే, ఇది సరైన నిర్ణయమేనని ఆమె పేర్కొన్నారు. 43 ఏళ్ల అబీ అధికార పగ్గాలు చేపట్టే సమయానికి ఇథియోపియా పలురకాల సమస్యలతో అల్లాడుతోంది. ఎంతోకాలంగా అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన కారణంగా, ఆర్థికంగా వెనుకబడింది. ఆఫ్రికా ఖండంలోనే చిరకాల శత్రువులుగా, దశాబ్దాలపాటు కలహించుకుంటున్న దేశాలుగా ఇథియోపియా, ఇరిట్రియా ముద్రపడ్డాయి. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో అధికార పగ్గాలను చేపట్టిన అబీ అత్యంత వేగంగా, సంస్కరణలను తీసుకొచ్చారు. వాటిని సమర్థంగా అమలు పరిచారు. ఇరిట్రియాతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా, అప్పటి వరకూ సరిహద్దు సమస్యకు తెరదించారు. స్తంభించిపోయిన రవాణా వ్యవస్థను పునరుద్ధరింపచేశారు. ఈ ఒప్పందం కారణంగా, అంతవరకూ ఇరిట్రియాపై విధించిన ఆంక్షలను యూఎన్ ఎత్తివేసింది. దీనితో అబీ ఇటు ఇథియోపియాలోనేగాక, అటు ఇరిట్రియాలోనూ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆర్థిక ఒడిదుడుగుల నుంచి బయటపడిన ఇథియోపియా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది.
స్వదేశంలో అబీ తీసుకున్న పలు నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. గతంలో విపక్షాల నేతలు, కార్యకర్తలుగా, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉండి, జైల్లో మగ్గుతున్న వేలాది మందిని ఆయన విడుదల చేయించారు. అంతవరకూ భావ ప్రకటనపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు. సామాజిక మాధ్యమాల్లో, ఎవరైనా, ఎప్పుడైనా తమతమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే అవకాశాన్ని కల్పించారు. భావ ప్రకటన స్వేచ్ఛ లభించడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ప్రజాస్వామ్య బద్ధంగా, స్వేచ్ఛాయుతంగా 2020లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఆయన ఇది వరకే ప్రకటించారు. లింగ వివక్ష ఎక్కువగా పాటించే దేశంలో మొట్టమొదటిసారి ఒక మహిళను అధ్యక్షురాలిగా చేశారు. ఇప్పుడు అక్కడ ఘర్షణలు లేవు. జర్నలిస్టులు ఎవరూ జైళ్లలో లేరు. ప్రతిపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, చివరికి మద్దతుదారులు కూడా స్వేచ్ఛగా తమతమ అభిప్రాయాలను వెళ్లడించవచ్చు. ఇరిట్రియాతో ఘర్షణలు లేదు. యుద్ధ భయం అంతకంటే లేదు. దీనితో ఆర్థికాభివృద్ధికి మార్గాలు తెరుచుకున్నాయి. మొత్తం మీద అత్యంత సమస్యాత్మకమైన ఇథియోపియాను ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు అబీ చేస్తున్న కృషికి ప్రపంచ దేశాలు జేజేలు పలుకుతున్నాయి. ఈ కారణంగానే ఆయనకు నోబెల్ శాంతి పరస్కారం లభించింది. అన్ని అంశాలూ సానుకూలంగానే ఉన్నప్పటికీ, ఆఫ్రికా ఖండంలో అనిశ్చితి ఎప్పుడు, ఏ రూపంలో తలెత్తుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే, వచ్చే ఏడాది ఎన్నికల్లోగా అబీకి మరిన్ని సమస్యలు, సవాళ్లు ఎదురుకావచ్చని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు ఎలావున్నప్పటికీ, ప్రజల మద్దతు అతనికే ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.