అంతర్జాతీయం

తల్లడిల్లిన టోక్యో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుజిసావా (జపాన్), అక్టోబర్ 12: గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో ఓ భయానక పెను తుఫాన్ టోక్యో, దాని పరిసర ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ప్రచండ గాలులు, కుండపోత వర్షంతో వీధులు, బీచ్‌లు, రైల్వే స్టేషన్లు నిర్మానుష్యమైపోయాయి. ఈ భయానక ప్రకృతి విలయం గురించి గంటలకు ముందే సమాచారం అందడంతో ప్రజలు ముందుజాగ్రత్తగా నిత్యావసరాలను నిల్వ చేసుకోవడంతో అన్ని మార్కెట్లు ఖాళీ అయిపోయాయి. మంచినీళ్ల నుంచి ఆహార పదార్థాల వరకు ఏది కూడా దుకాణాల్లో అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. హాజిబిస్ అనే ఈ పెను తుఫాన్ బీభత్సం గురించి, దాని తీవ్రత గురించి వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఈ తుఫాన్ తీరాన్ని తాకడంతో దాని తీవ్రతకు భూమి కూడా కంపించిందని చెబుతున్నారు. టోక్యో సమీపంలోని క్షిబా తీర ప్రాంతంలో ఈ తుఫాన్ మూల కేంద్రం ఉందని, దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని అమెరికా భౌగోళిక పరిశోధన కేంద్రం తెలిపింది. ‘మీ జీవితంలో ఎప్పుడూ చూడనంత తీవ్రస్థాయిలో కుంభవృష్టి సంభవిస్తుందని. తస్మాత్ జాగ్రత్త’ అని జపాన్ వాతావరణ కేంద్రం ప్రజలను హెచ్చరించింది. అన్ని రకాలుగాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని తెలిపింది. హాజిబిస్ అంటే ఫిలిప్పీన్ బాషలో ప్రచండ వేగం అని అర్థం. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ టోక్యో నగరాన్ని తాకింది.
*చిత్రం...హాజిబిస్ పెను తుఫాన్ తాకిడికి ఉవ్వెత్తున ఎగిసిన కెరటాలు