అంతర్జాతీయం

జపాన్‌లో హజీబిస్ తుపాను బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 13: శక్తివంతమయిన తుపా ను హజీబిస్ జపాన్‌లో బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఇప్పటికే 26 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. ప్రచండ వేగంతో దూసుకొచ్చిన హజీబిస్ తుపాను శనివారమే జపాన్‌ను ఢీకొంది. ఈ తుపాను కారణంగా అసాధారణ స్థాయిలో వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో పాటు నదులు పొంగిపొర్లుతుండటం వల్ల సైనిక బలగాలకు చెందిన 31వేల మంది సిబ్బంది సహా లక్ష మందికి పైగా సహాయక సిబ్బంది శనివారం రాత్రంతా ప్రజలను ఆదుకోవడానికి పనిచేశారు. తుపాను సృష్టించిన బీభత్సం కారణంగా రగ్బీ వరల్డ్ కప్ మూడో టోర్నమెంట్ మ్యాచ్‌ను రద్దు చేశారు. హజీబిస్ తుపాను ఆదివారం ఉదయం తీరం దాటింది. ముఖ్యంగా జపాన్ రాజధాని టోక్యోను అతలాకుతలం చేసింది. టోక్యో పరిసర ప్రాంతాల్లోనూ విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను కారణంగా 14 మంది మృతి చెందారని, 11 మంది గల్లంతయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 26 మంది మృతి చెందారని, 15 మంది ఆచూకీ తెలియడం లేదని స్థానిక మీడియా పేర్కొంది. సెంట్రల్ జపాన్‌లోని నాగనో సహా 12 ప్రాంతాల్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలుచోట్ల వరద నీరు జనావాసాల్లోకి చేరింది. చికుమా నది పొంగి ప్రవహిస్తుండటంతో పొరుగున ఉన్న నివాస ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. కొన్ని చోట్ల భవనాల రెండో అంతస్తు వరకు వరద నీరు చేరింది. అనేక ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలలో ఉన్న ప్రజలను సైన్యం, అగ్నిమాపక శాఖ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా బయటకు తీసుకు వచ్చారు. ఫుకుషిమాలోని ఇవాకి సిటీలో సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో ఒక మహిళ జారిపడి మృతి చెందింది. వాయవ్య టోక్యోలోని కవగోలో ఒక రిటైర్మెంట్ హోమ్‌నుంచి వందలాది మంది ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

*చిత్రం... జపాన్‌లో భయానక హజీబిస్ పెను తుఫాన్ తాకిడికి జలమయమైన ప్రాంతం