అంతర్జాతీయం

అణుయుద్ధం పేరుతో సీమాంతర ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 15: అణుయుద్ధం పేరుతో కవ్వించి, బెదిరించి, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని పాకిస్తాన్‌పై భారత్ ధ్వజమెత్తింది. భారత్‌తో అణు యుద్ధం తప్పకపోవచ్చని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఈ విధంగా కవ్వించి, తప్పించుకోవడం పాక్ నైజమని విమర్శించింది. ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ, తెరవెనుక నుంచి సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం పాకిస్తాన్‌కు ఆనవాయితీగా వస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) ఆధ్వర్యంలోని నిరాయుధీకరణ సదస్సు (సీడీ)కి భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దౌత్యవేత్త పంకజ్ శర్మ అన్నారు. అణు శక్తిని సాధ్యమైనంత వరకూ వినియోగించవద్దన్న సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అణుశక్తిగల దేశాలపై ముందుగా దాడి చేయబోదని, ఈ శక్తిలేని దేశాలపై అసలే ప్రయోగించదని ఆయన తెలిపారు.
అయితే, పాక్ విధానం ఇందుకు భిన్నంగా ఉంటుందని చెప్పారు. అణ్వయుధాన్ని బూచిగా చూపించి, యుద్ధానికి కవ్వించి, ఆతర్వాత తప్పించుకోవడం పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానమని మండిపడ్డారు. అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ, మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తున్నదని ఆరోపించారు. ఉగ్రవాదం కేవలం భారత్ మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే హానికారకంగా మారిందని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణుశక్తి ముసుగులో కొనసాగిస్తున్న పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను భారత్ రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది.