అంతర్జాతీయం

పాక్‌కు తాత్కాలిక ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 18: తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కొనే పరిస్థితి నుంచి పాకిస్తాన్ తాత్కాలికంగా బయటపడింది. పారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఐదు రోజుల ప్లీనరీలో పాక్ పట్ల కొంత ఉదారంగా వ్యవహరించింది. లష్కరే తోయిగా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ సర్కారు ఆర్థిక సాయం చేస్తున్నదన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలంటూ అమెరికా, భారత్ వంటి దేశాలు ఎన్నిపర్యాయాలు స్పష్టం చేసినప్పటికీ, పాక్ ఆ దిశగా తీసుకున్న చర్యలు మృగ్యం. ఉగ్రవాద నిర్మూలనతోపాటు, ఆయా ఉగ్రవాద సంస్థలకు మనీ లాండరింగ్ వంటి మార్గాల్లో అందుతున్న ఆర్థిక సాయంపై చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ ఇది వరకే హెచ్చరించింది. మొత్తం 27 చర్యలను ప్రతిపాదించింది. వాటిని పూర్తి చేస్తేనే ఉగ్రవాదానికి తెరపడే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఎఫ్‌ఏటీఎఫ్ సూచనలనుగానీ, హెచ్చరికలనుగానీ పాకిస్తాన్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. కేవలం ఐదు అంశాల్లో మాత్రమే నామమాత్రపు చర్చలు తీసుకుంది. మిగతా అంశాల జోలికి వెళ్లలేదు. కాగా, 39 దేశాల సభ్యత్వం ఉన్న ఎఫ్‌ఏటీఎఫ్‌లో నాలుగు దేశాలు మాత్రమే పాకిస్తాన్ మిత్ర దేశాలు. మిగతా దేశాలన్నీ పాక్ తీరును ఎండగడుతున్నాయి. అయితే, అధ్యక్ష స్థానంలో చైనా ఉండడంతో, ‘రెడ్ లిస్ట్’లో పడిపోయే ప్రమాదం నుంచి పాక్ తప్పించుకోగలిగింది. చైనా పట్టుబట్టడంతో, ఫిబ్రవరి వరకూ పాక్‌కు గడువు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేకపోతే, వచ్చే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌కు స్పష్టం చేసింది. ప్రస్తుతం పాక్‌ను ‘గ్రే లిస్ట్’లో ఉంచామని, ఫిబ్రవరి నాటికి తాము సూచించిన అన్ని అంశాలను పూర్తి చేయకపోతే ఆర్థిక పరమైన ఆంక్షలు, కఠిన నిర్ణయాలు తప్పవని తేల్చిచెప్పింది. అయితే, చైనా మద్దతునిస్తున్నందున, ఎఫ్‌ఏటీఎఫ్ హెచ్చరికలను పాక్ ఖాతరు చేస్తుందా? లేదా? అన్నది అనుమానమే.