అంతర్జాతీయం

పదేపదే అవే అబద్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, అక్టోబర్ 19: ఐరాసలో జమ్మూకాశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను వక్రీకరించడమే అజెండాగా పెట్టుకుని అదే పనిగా ఆరోపణలు చేస్తోందని ఐరాస శాశ్వత మిషన్‌లోని భారత ప్రతినిధి దీపక్ మిశ్రా ధ్వజమెత్తారు. ఐరాసలో పాకిస్తాన్ ప్రతినిధి మహీలా లోధీ గత వారం ఫోరంలో జమ్మూకాశ్మీర్ అంశంపై ప్రస్తావించిన విషయాలను ఈ సందర్భంగా ఆయన తప్పుపట్టారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును పాకిస్తాన్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. ఐరాస మద్దతునూ సంపాదించలేకపోయింది. ఇంత జరిగినా జమ్మూకాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా ప్రయోజనం పొందాలని పాకిస్తాన్ ప్రయత్నించడం సిగ్గుచేటని మిశ్రా విమర్శించారు. ఫోరం సమావేశంలో మిశ్రా మాట్లాడుతూ అవకాశం దొరికినప్పుడు భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందాలని చూస్తోందని పాక్‌పై ధ్వజమెత్తారు. జమ్మూకాశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల విఫలయత్నం చేసిందని ఆయన అన్నారు.
ఐరాసతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా కాశ్మీర్ అంశం భారత్ అంతర్భాగమని స్పష్టం చేసిన విషయాన్ని మిశ్రా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాము అంగీకరించేదిలేదని ఆయన వెల్లడించారు.