అంతర్జాతీయం

కొత్త పుంతల్లో మైత్రీబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 20: వ్యూహాత్మక రీతిలో ద్వైపాక్షిక బంధాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి భారత్-అమెరికాలు మరో అడుగు ముందుకు వేయబోతున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు సోమవారం ఢిల్లీలో జరుగబోయే సుదీర్ఘ వాణిజ్య, భౌగోళిక రాజకీయ భేటీకి సన్నద్ధమవుతున్నారు. ఇరు దేశాల మధ్య రెండో వార్షిక నాయకత్వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘వృద్ధిలో భాగస్వాములు’ అన్న అంశంపై ఈ కీలక సదస్సు జరుగబోతోంది. ఇందులో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్, మాజీ విదేశాంగ మంత్రి కొండోలిజా రైస్, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సహా అనేకమంది పాల్గొంటున్నారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యానికి ఉద్దేశించినవి కావని, భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాదని, వీటికి అతీతమైన రీతిలో వృద్ధి, ప్రగతి, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలన్నదే లక్ష్యమని భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అధ్యక్షుడు ముఖేష్ అఘీ వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అతీతమైన రీతిలో ఈ రెండు దేశాల మధ్య మైత్రి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్-అమెరికాలకు చెందిన దాదాపు 300 మంది ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. సుస్థిర అభివృద్ధి, భద్రత, ఇంధన లభ్యత, సృజన వంటి అనేక అంశాలపై ఈ సదస్సులో విస్తృతస్థాయిలో చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య మైత్రిని విస్తరించే దిశగా కొత్త అంశాలను చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతామని అన్నారు. తమకు ఏరకమైన రాజకీయ అజెండా లేదని, రెండు దేశాల మధ్య అనుబంధాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అనేకమంది అమెరికా సీఈఓలు కొన్నిరోజులపాటు భారత్‌లోనే ఉండాలనుకోవడం ఈ దేశం పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించే రీతిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.