అంతర్జాతీయం

దీపావళినాడు ర్యాలీ వద్దు: మేయర్ హితవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 20: కాశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లండన్‌లో దీపావళి (ఆదివారం) నాడు ర్యాలీ నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను లండన్ నగర మేయర్ సాదిక్ ఖాన్ ఖండించారు. ఈ ర్యాలీ వల్ల నగరంలో ప్రజల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిర్వాహకులు, ర్యాలీలో పాల్గొనాలని భావిస్తున్న ప్రజలు తమ నిరసన ర్యాలీని రద్దు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వవలసిందిగా నిర్వాహకులు ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. 5వేల నుంచి 10వేల మంది వరకు ప్రజలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొంటారని అంచనా. డౌనింగ్ స్ట్రీట్ సమీపంలోని రిచ్‌మోండ్ టెర్రాస్ నుంచి ప్రదర్శనను ప్రారంభించి లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ వరకు వెళ్లాలని, హైకమిషన్ వెలుపల సభ నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన లండన్ అసెంబ్లీ సభ్యుడు నవీన్ షా రాసిన లేఖపై మేయర్ ఖాన్ స్పందిస్తూ ‘పవిత్ర దినమయిన దీపావళి రోజున ఇండియన్ హైకమిషన్ సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు.