అంతర్జాతీయం

11 రోజుల్లోనే తప్పుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 21: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు సంబంధించి అక్టోబర్ 31 డెడ్‌లైన్ పొడిగించడానికి అన్యమనస్కంగా అంగీకరించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం పట్టువీడడం లేదు. మరో 11 రోజుల వ్యవధిలో ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయమని ఆయన తీవ్ర స్వరంతో చెబుతున్నారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో శనివారం సాగిన హై డ్రామాలో జాన్సన్ బ్రెగ్జిట్ ప్రయత్నాలకు చుక్కెదురైంది. ఈ ‘విడాకుల’ గడువును పొడిగించాల్సిందేనని మెజారిటీ ఎంపీలు తమ ఓటు ద్వారా స్పష్టం చేయడంతో మరో మార్గాంతరం లేక అందుకు జాన్సన్ బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తదుపరి మార్గానే్వషణకు సంబంధించి జాన్సన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. తాజా గడువు కాకపోతే ఎప్పుడు, ఎలా బ్రెగ్జిట్ అమలవుతుందన్న దానిపై అయోమయం నెలకొంది. 2016లో ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించి జరిగిన చారిత్రక ఓటింగ్‌లో అనుకూలంగా తీర్పు ఇచ్చిన వారికి, దీనిని వ్యతిరేకించిన వారికి మధ్య ఓట్ల తేడా స్వల్పం కావడంతో ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు జఠిలం అవుతూ వస్తోంది. శనివారం ఓటింగ్ నేపథ్యంలో అధికారికంగా సంతకం చేయకపోయినా, బ్రెగ్జిట్ గడువును పొడిగించాలంటూ ఐరోపా యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు జాన్సన్ ఒక లేఖను పంపారు. అయితే, అది జరిగిన స్వల్ప వ్యవధిలోనే అధికారికంగా సంతకం చేస్తూ మరో లేఖను కూడా ఐరోపా యూనియన్ మండలి అధ్యక్షుడికి జాన్సన్ పంపారు. ఇందులో మాత్రం బ్రెగ్జిట్ డెడ్‌లైన్‌ను పొడిగించాలని తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రెగ్జిట్ అమలు గడువు రెండుసార్లు వాయిదా పడిందని, ఇక ఎంతమాత్రం దీనిని పొడిగించినా యునైటెడ్ కింగ్‌డమ్, అలాగే ఐరోపా యూనియన్‌లోని భాగస్వామ్య దేశాల ప్రయోజనానికే విఘాతం కలుగుతుందని ఆ లేఖలో జాన్సన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరో 11 రోజుల వ్యవధిలో ఐరోపా యూనియన్ నుంచి తప్పుకునేందుకు జాన్సన్ ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నట్టు సీనియర్ కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ చేసిన ప్రకటన బట్టి స్పష్టమవుతోంది. ‘అవును, ఈనెల 31నే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగుతోంది. అందుకు అవసరమైన సాధనా సంపత్తి, సామర్థ్యం మాకు ఉన్నాయి’ అని స్కై న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మైఖేల్ గోవ్ తెలిపారు.