అంతర్జాతీయం

నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవితో రాష్ట్రపతి కోవింద్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 22: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీతో మంతనాలు జరిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ఇతరత్రా కీలక అంశాలపై వారు చర్చించారు. జపాన్ చక్రవర్తి నారుహిటో పట్ట్భాషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు విద్యాదేవి భండారీ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ కొంత సేపు దైపాక్షిక సంబంధాల అంశాలపై చర్చించారు. జపాన్ చక్రవర్తి పట్ట్భాషేకం కార్యక్రమంలో భారత రాష్ట్రపతి పాల్గొనడం 29 ఏళ్ళలో ఇదే మొదటిసారి అని రాష్టప్రతి భవన్ కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది.
రాష్ట్రపతి కోవింద్ సోమవారం టోక్యోకు చేరుకున్నారు. కోవింద్ తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లోని భారతీయుల సమ్మేళనంలో పాల్గొననున్నారు.