అంతర్జాతీయం

కాశ్మీర్ పరిస్థితి మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 22: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వ అభివృద్ధి అజెండాను తాము బలపరుస్తున్నామని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఒక మెలిక పెట్టింది. కాశ్మీర్‌లో తాజా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ముఖ్యంగా కాశ్మీర్ లోయలో పరిణామాలు అలజడి కలిగిస్తున్నాయని పేర్కొంది. అయితే, ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను తాము లోతుగా పర్యవేక్షిస్తున్నామని, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ విదేశాంగ మంత్రి అలీస్ జీ వెల్స్ అన్నారు. కాశ్మీర్‌ను అభివృద్ధిపథంలో నడిపించడం, అవినీతిని నిరోధించడం మిగతా అన్ని రాష్ట్రాలతో సమానంగానే అక్కడ కూడా జాతీయ చట్టాలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే 370 అధికరణను రద్దు చేసినట్టు భారత ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ లక్ష్యాలను తాము బలపరుస్తున్నామని, అయితే, అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం కాశ్మీర్ పరిస్థితి పట్ల ఆందోళన చెందుతోందని, దాదాపు 80 లక్షల మంది ఆ రాష్ట్ర ప్రజల జనజీవనం ఆగస్టు 5 నుంచి అయోమయ చందంగానే ఉందని కాంగ్రెస్ సబ్‌కమిటీకి సమర్పించిన నివేదికలో అలీస్ జీ వెల్స్ వెల్లడించారు. జమ్మూ, లడఖ్ ప్రాంతంలో పరిస్థితులు మెరుగైనప్పటికీ కాశ్మీర్ లోయలో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ఆమె తెలిపారు. స్థానికులు, రాజకీయ నాయకుల నిర్బంధానికి సంబంధించిన అంశాన్ని తాము అధికారుల దృష్టికి తెచ్చామని, మానవ హక్కుల పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని గట్టిగా కోరినట్టు ఆమె స్పష్టం చేశారు. తక్షణమే ఇంటర్‌నెట్, మొబైల్ సహా అన్నిరకాల సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని గట్టిగా కోరారు. పోస్టుపెయిడ్ మొబైల్ సర్వీసులను కాశ్మీర్ లోయలో పునరుద్ధరించినప్పటికీ ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి రాలేదని తెలిపారు. విదేశీ, స్థానిక జర్నలిస్టులు అక్కడి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నప్పటికీ భద్రతాపరమైన ఆంక్షల కారణంగా అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. గత రెండు నెలల కాలంలో కొన్ని వందల మందిని నిర్బంధంలోకి తీసుకున్నారని, వీరి సంఖ్య ఎంతో ఇప్పటికీ స్పష్టం కావడం లేదని ఆమె తెలిపారు. నవంబర్ 14న కాశ్మీర్‌కు సంబంధించిన భారత సుప్రీంకోర్టు విచారించబోతున్నట్టు తెలుస్తోందని, అలాగే కాశ్మీర్ హైకోర్టు హెబియస్ కార్పస్ కేసులను సమీక్షిస్తోందని ఆమె తెలిపారు.