అంతర్జాతీయం

సౌదీలో ఆర్థిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 23: వచ్చే వారం సౌదీ అరెబియాలో జరిగే వార్షిక ఆర్థిక సదస్సుకు అమెరికా నుంచి వెళ్ళే ముఖ్య ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి దేశాధ్యక్షుని సలహాదారుడు జరెడ్ ఖుష్నర్, ఆర్థిక కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ నాయకత్వం వహిస్తారని అమెరికా మీడియా పేర్కొంది. గత ఏడాది అసమ్మతి జర్నలిస్టు జమాల్ ఖష్యోగి హత్యతో నిరసనగా అనేక కార్యక్రమాల విస్తృత బహిష్కరణల అనంతరం దీనిని చేపట్టింది.
సౌదీ జర్నలిస్టు, వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు ఖష్యోగి గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన రాజ్య కాన్సిలేట్ వద్ద గొంతు కోసి హత్యకు గురయ్యాడు. దీంతో డజన్ల కొద్ది టాప్ గ్లోబల్ అధికారులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు అప్పటి నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఖష్యోగి హత్యతో అంతన్జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కానీ పెట్రో మిత్రుడైన సౌదీని అంత తేలిగ్గా వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. ఈ ఏడాది సౌదీలో జరిగే వార్షిక ఆర్థిక సదస్సుకు మ్నుచిన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందాన్ని పంపించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఆర్థిక కార్యదర్శి, ట్రంప్ అల్లుడు ఖుష్నర్, ఇరాన్ విధానాల ప్రత్యేక పర్యవేక్షించే ప్రత్యేక రాయబారి బ్రెయిన్ హెచ్.హుక్ కూడా పాల్గొంటారని ఆ పత్రిక తెలిపింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరవుతారని ఆయా దేశాల స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. వచ్చే వారం ప్రారంభమయ్యే ఈ సదస్సులో విదేశీ పెట్టుబడులు, ఆర్థిక, చమురు తదితర అంశాలపై చర్చ జరుగుతుంది.