అంతర్జాతీయం

పరిశుభ్రత లేమితోనే ‘సూపర్‌బగ్’ వ్యాప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 23: విషక్రిమి నాశకాలను తట్టుకునే శక్తి గల ‘సూపర్‌బగ్’ ఈకోలి బ్యాక్టీరియా విస్తరించడానికి కోడికూర, మాంసం, ఇతర ఆహార పదార్థాలను తగినంతగా ఉడికించకుండా తినడంకన్నా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే ఎక్కువ కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయింది. జంతువుల వలెనే మనుషులు కూడా తమకు హాని కలగకుండా తమ పేగుల్లో ఈకోలి బ్యాక్టీరియాను మోస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాలలో కలుషితాహారానికి (్ఫడ్ పాయిజనింగ్) దారితీయడం, మూత్రకోశ సంబంధిత అంటువ్యాధులకు దారితీయడం, పేగులకు శస్తచ్రికిత్స చేసిన తరువాత ఇన్‌ఫెక్షన్ కావడం వంటివి చోటు చేసుకుంటున్నాయని బ్రిటన్‌లోని యూనివర్శిటి ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ) పరిశోధకులు తెలిపారు. గత 20 ఏళ్ల కాలంలో ఇటు మనుషుల్లోను, అటు జంతువుల్లోను యాంటీబయాటిక్స్‌ను బాగా తట్టుకుని మనగలిగే బ్యాక్టీరియాగా ఈకోలి నిలిచిందని పరిశోధకులు వివరించారు. ‘ద లానె్సట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్’లో ఈ తాజా అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం 20వేలకుపైగా నమూనాలను సేకరించారు.