అంతర్జాతీయం

కొత్త సంస్కరణలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 24: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వ్యాపారం) చేసే 50 దేశాల సరసన చేరాలంటే భారత్ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని ప్రపపంచ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. వచ్చే మూడు నాలుగేళ్లలో భారత్ ఈ దిశగా ఆలోచించి ధైర్యంతో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని గురువారం ఇక్కడ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 63వ స్థానం నుంచి 14వ ర్యాంక్‌కు భారత్ ఎగబాకడంపై ప్రపంచ బ్యాంక్ అధికారులు ఈ సూచన చేశారు. బ్యాంకులను దివాళా నుంచి గట్టెకించడం, ఎన్‌ఫోర్స్‌మెంట్ కాంట్రాక్టులు, పన్నుల సంస్కరణలు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి టాప్ 50 జాబితాలోకి చేరుకోవాలని ప్రపంచ బ్యాంక్ ఆర్థిక వ్యవహారాల అభివృద్ధి విభాగం డైరెక్టర్ సిమియోన్ డన్‌కొవ్ అన్నారు. ధైర్యంతో సంస్కరణలు చేస్తే కనీసం 40వ స్థానంలోకి భారత్ చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా లాటిన్ అమెరికా, ఐరోపా దేశాలతో భారత్ గట్టిపోటీనే ఎదుర్కొంటోందని ఆయన వెల్లడించారు. అయితే కఠిన నిర్ణయాలు తీసుకుంటే అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థకు ధీటుగా ఎదగడం ఏమంత కష్టం కాదని ఆయన పేర్కొన్నారు. తాజాగా కొన్ని సంస్కరణలను భారత్ చొరవ చూపాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతల్లో మార్పు రావల్సిందేనని డన్‌కొవ్ చెప్పారు. ‘టాప్ 25 జాబితాలో చోటు సంపాదించడం సాధ్యమే. అయితే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ఇది కొంత కష్టమే’అని ఆయన అన్నారు. అందుకే వచ్చే నాలుగేళ్లలో కొత్త అజెండా రూపొందించుకుని సంస్కరణలకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సులభతర వ్యాపారంలో టాప్ 50 జాబితాలో చేరడానికి భారత్‌కు ఏ మంత కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మీ విధానాలు మార్చుకోవాలి. వచ్చే మూడు నాలుగేళ్లకు కొత్త సంస్కరణలతో రావాలి’అని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి తొలి 15 ఏళ్లలో భారత్ నిలదొక్కుకోడానికి భారత్ కొట్టుమిట్టాడిందని ఆయన తెలిపారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితితో ఎంతో మార్పు కనిపించిందని డన్‌కొవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ర్యాంకింగ్‌లో భారత్ స్థాయి ఎంతో మెరుగుపడిందని, ఎంతో ఆశాజనంగా సాగుతోందని ఆయన అన్నారు.