అంతర్జాతీయం

వియన్నా పట్టని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 31: భారత నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ అరెస్టు, నిర్బంధానికి సంబంధించి వియన్నా ఒడంబడికను పాకిస్తాన్ ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దు ఇలాకావి యూసఫ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ మరణశిక్షకు బ్రేక్ పడింది. జాదవ్‌ను ఇరాన్‌నుంచి పాక్ గూఢచారులు కిడ్నాప్ చేశారని, అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం నివేదికను ఐరాసకు యూసఫ్ అందజేశారు. వియన్నా ఒడంబడికలోని 36వ అధికరణ కింద తన బాధ్యతలను నిర్వర్తించడంలో పాకిస్తాన్ విఫలమైందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూలైలో ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పులో కూడా ఈ విషయాన్ని ఆయన విస్పష్టంగా తెలియజేశారు. జాదవ్ మరణశిక్షను సమీక్షించాల్సిందేనని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు భారత్‌కు ఎంతో ఉపశమనం కలిగించింది. జాదవ్‌ను కలుసుకునేందుకు భారత అధికారులను అనువదించే విషయంలోనూ పాక్ కప్పదాటు వైఖరిని అవలంబించిందని, ఈ అంశాలను అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు ఐరాసకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించారు. జాదవ్ కేసులో తమ తీర్పునకు సంబంధించి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. జాదవ్ కేసు విషయంలో వియన్నా ఒడంబడికలోని 36వ అధికరణ పూర్తిస్థాయిలో వర్తిస్తుందని స్పష్టం చేశారు. జాదవ్‌ను అరెస్టుచేసిన మూడు వారాల తర్వాత పాకిస్తాన్ ఆ విషయాన్ని భారత్‌కు తెలియజేయడం కూడా వియన్నా ఒప్పందంలోని భాగమేనని ఆయన అన్నారు.