అంతర్జాతీయం

మరింత సన్నిహితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: భారత్-జర్మనీల మధ్య అన్ని రంగాల్లోనూ గుణాత్మక సంబంధాలు పెంపొందుతున్నాయని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలో ఇరు దేశాలు అంతర్జాతీయ స్థాయిలో మరింతగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మనీల్యాండరింగ్‌ను నిరోధించే అంతర్ ప్రభుత్వ సంస్థ ఆర్థిక కార్యాచరణ టాస్క్ఫోర్సు (ఎఫ్‌ఏటీఎఫ్)లో భారత్ జర్మనీలు మరింత సమన్వయంతో వ్యవహారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు రోజుల పర్యటనార్థం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఎంజీలా మెర్కల్‌కు స్వాగతం పలికిన ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలు భారత్-జర్మనీలకు ఉన్నాయని స్పష్టం చేశారు. జీ-4 దేశాల కూటమిగా భారత్-జర్మనీలు మరింత కలిసి కట్టుగా పని చేయాలని, లక్ష్యాన్ని సాధించే దిశగా బలంగా ముందుకు సాగాలని అన్నారు. ఐరోపా యూనియన్ భారత్‌ల మధ్య వాణిజ్య పెట్టుబడుల ఒప్పందం సత్వర ప్రాతిపదికన కుదిరేలా భారత్‌కు జర్మనీ సహకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అంతేకాకుండా భారత్-జర్మనీల మధ్య ద్వైపాక్షిక వాణి జ్యం సాంకేతిక సహకారం కూడా విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఈ రెండు దేశాలు బహుముఖీయ ప్రపంచ వ్యవస్థ ఆవిష్కరణకు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికే పెను సవాల్‌గా పరిణమిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు కలిసి కట్టుగా ఈ జాఢ్యాన్ని ఎదుర్కొవాలన్నారు. భారత్-జర్మనీల మధ్య అన్ని రంగాల్లోనూ సహకారం, సయోధ్య ఎంతో అవసరం అని తెలిపారు.