అంతర్జాతీయం

బ్రెగ్జిట్ సెగ.. ట్రంప్ పొగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 1: ఓ పక్క బ్రెగ్జిట్ వ్యవహారం బ్రిటన్ రాజకీయ పార్టీల మధ్య పెను చిచ్చు రేపుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసిన చందంగా మారాయి. ఐరోపా యూనియన్ నుంచి నిష్క్రమించడానికి సంబంధించిన తన ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడంతో ఇక ఎన్నికలే శరణ్యం అన్నట్టుగా ప్రధాని బోరిస్ జాన్సన్ ముందుకు సాగుతున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బిన్ కూడా సన్నద్ధతను ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దర్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన స్నేహితుడైన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అద్భుతమైన వ్యక్తి అని, ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కార్బిన్ నాయకత్వం బ్రిటన్‌కు ఎంతమాత్రం పనికి రాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎల్‌బీసీ రేడియోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈవిధంగా మాట్లాడడం బ్రిటన్‌లో రాజకీయ సెగను మరింత రగిలిస్తోంది. వచ్చే నెల 12న జరుగనున్న బ్రిటన్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంగానే ట్రంప్ వ్యాఖ్యలను ఇక్కడి రాజకీయ పార్టీలు పరిగణిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ, బ్రెగ్జిట్ పార్టీ నాయకుడు లీజెల్ పరాజ్ సారథ్యంలోని పార్టీ చేతులు కలపాలని, ఈ రెండూ కలిసి పనిచేస్తే విజయం తథ్యమని కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు. కన్జర్వేటివ్‌లు, బ్రెగ్జిట్ పార్టీ కలిసి పనిచేస్తే మాత్రం వాటి శక్తిని ఎవరూ ఆపలేరని కూడా పేర్కొన్న ట్రంప్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకులు కార్బిన్‌పై చేసిన పరుష వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. లేబర్ పార్టీకి దేశ నాయకత్వాన్ని అప్పగిస్తే దాని నాయకుడు కార్బిన్‌లాగానే దేశం కూడా తప్పుడు మార్గంలోనే ముందుకు వెళ్తుందని ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
బ్రిటన్ ఓ గొప్ప దేశమని, ఇంకా ఎంతో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని పేర్కొన్న ఆయన ప్రస్తుత ప్రధాని, కన్జర్వేటివ్ నాయకుడు బోరిస్ జాన్సన్‌ను ఎన్నుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో అత్యుత్తమమని వ్యాఖ్యానించారు. బ్రెగ్జిట్ వ్యవహారంలో తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక మధ్యంతర ఎన్నికలే శరణ్యమనే రీతిలో బోరిస్ జాన్సన్ పావులు కదిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా తమ పార్టీకి మెజారిటీ ప్రజల మద్దతు లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు బ్రెగ్జిట్టే ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోంది.