అంతర్జాతీయం

పిచ్చి ప్రయత్నాలు మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, నవంబర్ 1: ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ అంశంపై చేసిన తప్పుడు ప్రచారాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు’ అజెండాలో ఎన్నడూ జమ్మూకాశ్మీర్ లేదని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ తన ‘ప్రాదేశిక దురాశ’కు విశ్వసనీయతను సంపాదించడం కోసం ‘పిచ్చి ప్రయత్నాలు’ చేస్తోందని భారత్ నిశితంగా విమర్శించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ కమిటీలో తాజాగా పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐరాసలో పదవినుంచి వైదొలగనున్న పాకిస్తాన్ రాయబారి మలీహా లోధి జనరల్ అసెంబ్లీ కమిటీలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. సామాజిక, మానవతావాద వ్యవహారాలు, మానవ హక్కుల అంశాలను చూసే జనరల్ అసెంబ్లీ కమిటీలో లోధి మాట్లాడుతూ 11 భద్రతా మండలి తీర్మానాలు ఇచ్చిన హామీ ప్రకారం కాశ్మీరీలు స్వయం నిర్ణయాధికారానికి సంబంధించి తమ అవిచ్ఛేద్య హక్కుకోసం వేచి చూస్తున్నారని అన్నారు. ‘ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు అజెండాను ఒక ప్రతినిధి మరోసారి దుర్వినియోగం చేయాలని కోరారు. వలస విముక్తి సందర్భం కాని విదేశీ ఆధిపత్యం సందర్భం కాని పరిస్థితికి దీనిని వర్తింప చేయాలని కోరడం ద్వారా ఈ హక్కును దుర్వినియోగం చేయాలని సూచించారు. భారత్‌లో అంతర్భాగమయిన జమ్మూకాశ్మీర్‌ను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఎంతో ముఖ్యమయిన ఈ అజెండాను విధ్వంసం చేయడానికి ఆ ప్రతినిధి ఏమాత్రం సంకోచించలేదు’ అని ఐరాసకు భారత పర్మనెంట్ మిషన్‌లోని ఫస్ట్ సెక్రెటరి పౌలోమి త్రిపాఠి బుధవారం జనరల్ అసెంబ్లీ థర్డ్ కమిటీలో ‘ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు’పై జరిగిన చర్చలో మాట్లాడుతూ అన్నారు. ‘ఐరాస ‘ప్రజల స్వయంనిర్ణయాధికార హక్కు’ అజెండాలో జమ్మూకాశ్మీర్ అంశం ఎన్నడూ లేదనేది అసలు వాస్తవం’ అని త్రిపాఠి పేర్కొన్నారు. ఏ/74/309లో ఉన్న డాక్యుమెంట్ స్వయం నిర్ణయాధికార అజెండాలో జమ్మూకాశ్మీర్‌ను చేర్చలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది’ అని త్రిపాఠి వివరించారు.