అంతర్జాతీయం

భారత ఐటిపైనే గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 14: హెచ్ 1బి, ఎల్-1 వీసాల ఫీజులను గణనీయంగా పెంచడం వివక్షాపూరితమని, భారత ఐటి కంపెనీలను లక్ష్యంగా చేసుకునే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి, రాయబారి మైకేల్ ఫ్రోమన్‌తో జరిపిన చర్చల సందర్భంగా జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే పరిపూర్ణీకరణ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దీని వల్ల అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. భారత ఐటి ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్న వీసా ఫీజులను పెంచడం అన్నది ఎంత మాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్న ఆయన దీని వల్ల కచ్చితంగా భారత కంపెనీలు దెబ్బతింటాయని తెలిపారు. తమ దేశంలో అమలు చేస్తున్న బయోమెట్రిక్ ట్రాకింగ్ వ్యవస్థ, 9/11 ఆరోగ్య సంరక్షణ చట్టానికి నిధులను సమీకరించుకునే ఉద్దేశంతో హెచ్ 1బి, ఎల్-1 వీసాల ఫీజులను 4500డాలర్లకు పెంచాలని అమెరికా కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంలో భారత ఐటి నిపుణులు అమెరికా సామాజిక భద్రత పన్నుల కింద దాదాపు 25బిలియన్ డాలర్ల మేర సమకూర్చారు. ఇంత వరకూ ఈ పన్నుల్లో వారికి నయాపైసా తిరిగిరాలేదు.సామాజిక పన్నులకు సంబంధించి ఆదాయాలపై ద్వంద్వ పన్నులు వేయకుండా నివారించే ఉద్దేశంతోనే ఈ టోటలైజేషన్ ఒప్పందాలను వివిధ దేశాలతో అమెరికా కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే స్వల్ప వ్యవధి పాటు మరో దేశంలో పనిచేయడానికి వెళ్లే వ్యక్తులు సామాజిక పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడులకు పరస్పర భద్రతను కల్పించుకోవడానికి వీలుగా ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకూ భారత్-అమెరికాలు చర్చలు జరుపుతున్నాయి.