అంతర్జాతీయం

పాకిస్తాన్ పని.. ఉగ్రవాదం ఎగుమతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియెంటియాన్, సెప్టెంబర్ 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశాల వేదికపైనుంచి పాకిస్తాన్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మా పొరుగు దేశం ఒకటి ఉగ్రవాదాన్ని సృష్టించి, ఎగుమతి చేస్తోంది’ అంటూ ఆయన పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే, అది అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రపంచానికి ఈ ఉగ్రవాదం ఎగుమతిని మనం అడ్డుకోవలసిన సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశాన్ని ఏకాకిని చేసి, ఆంక్షలు విధించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అంతకుముందు మోదీ ఇక్కడ జరిగిన 14వ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఉగ్రవాదం ఎగుమతి’ రోజురోజుకూ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న ఆ దేశాన్ని తూర్పారబట్టారు. ఈ ఉగ్రవాదం ఎగుమతి వల్ల ఈ ప్రాంతంలోని అన్ని దేశాలకు భద్రతా పరమైన ముప్పు వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం ఎగుమతి, పెరుగుతున్న మత ఛాందసవాదం, తీవ్రమైన హింస విస్తరిస్తుండటం అనేవి మన సమాజాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ముప్పులు’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా ప్రధానమంత్రి లి కెకియాంగ్‌తో కలిసి తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ తన ప్రసంగంలో పాకిస్తాన్ చేస్తున్న ‘ఉగ్రవాదం ఎగుమతి’ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలను ఎత్తిచూపారు. ‘ఈ ఉగ్రవాదం ఎగుమతి వల్ల సమాజంలో శాంతి తగ్గిపోయి, హింస పెరుగుతోంది. అంతిమంగా శాంతి, సౌభాగ్యాలను ప్రమాదంలోకి నెడుతోంది’ అని ఆయన అన్నారు. ఈ ఉగ్రవాద ప్రేరేపక దేశాన్ని ఏకాకిని చేయవలసిన, దానిపై ఆంక్షలు విధించవలసిన సమయం ఆసన్నమయిందని మోదీ అన్నారు.
‘దక్షిణాసియాలోని ఒకే ఒక్క దేశం ఉగ్రవాద కారకాలను వ్యాప్తి చేస్తోంది’ అంటూ మూడు రోజుల క్రితం పాకిస్తాన్‌పై దాడిని ఎక్కుపెట్టిన మోదీ గురువారం కూడా దాన్ని కొనసాగించారు. ఉగ్రవాద జాడ్యాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి పారితోషికాలు ఇవ్వకుండా దానిపై ఆంక్షలు విధించి ఏకాకిని చేయాలని సోమవారం హాంగ్‌ఝౌలో జి-20 దేశాల నేతలను కోరిన మోదీ తూర్పు ఆసియా సమ్మిట్‌లోనూ తన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ‘ఉగ్రవాదులనే కాకుండా వారికి మద్దతుగా నిలిచిన మొత్తం వ్యవస్థనూ మనం లక్ష్యంగా చేసుకోవలసిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్న దేశానికి వ్యతిరేకంగా మన అత్యంత కఠినమైన చర్య ఉండాలి’ అని మోదీ అన్నారు. బహుళ సంస్కృతులు ఉన్న సమాజాలకు ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైన సవాలు అని మోదీ హెచ్చరించారు. ఈ ఉగ్రవాద జాడ్యానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడవలసిన అవసరం ఎంతయినా ఉందన్నారు.