అంతర్జాతీయం

లొంగేది లేదు: ఇమ్రాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ఎంతగా తనపై ఒత్తిడి తీసుకువచ్చినా, ఎన్ని ధర్నాలు, మార్చ్‌లు చేసినా లొంగేది లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెగేసి చెప్పారు. గిరిజిత్-బాల్టిస్తాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన నిరసనకారులపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరెన్నాళ్లు కావాలంటే అన్నాళ్లు కూర్చోండి. ఆహారం అయిపోతే పంపిస్తాం. అయితే, నానుంచి ఈ విపక్ష నేతలకు ఎలాంటి ఉపశమనం ఉండదు’ అని అన్నారు. గతంలో ఇస్లామ్ మతాన్ని ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడున్న నవ పాకిస్తాన్‌లో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని అన్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు, అధికారులు తమ తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కకావికలు అయిపోయాయని, అవినీతికి పాల్పడ్డ ఎవర్నీ తాను ఒదిలేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వారందర్నీ జైలులో పెట్టడం ఖాయమని ఆయన అన్నారు.