అంతర్జాతీయం

ఉగ్రవాదం ఊసే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 2: కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్యాంకాక్‌కు వచ్చిన ఆయన శనివారం భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు అసాధ్యం గా భావించిన లక్ష్యాలనే తమ ప్రభుత్వం సాధిస్తోందని, ఆ దిశగానే మరింత ముం దుకు వెళ్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాల ఊసే లేకుండా చేయడంలో తాము కృతకృత్యమయ్యామని మోదీ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదైతే దాని ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 370 అధికరణ రద్దు నిర్ణయానికి సంబంధించిన సానుకూల ప్రతిస్పందనలను తాను థాయ్‌లాండ్‌లో కూడా వింటున్నానని అన్నారు. 370 అధికరణ రద్దు అంశాన్ని మోదీ ప్రస్తావించినపుడు భారతీయ సంతతి ప్రజలు హర్షధ్వానాలు పలికారు. తనకు లభించిన ఈ హర్షధ్వానాలన్నీ భారత పార్లమెంటుకు, ఈ చట్టాన్ని ఆమోదించిన పార్లమెంటేరియన్లకు చెందుతాయని తెలిపారు. చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వం పనిచేసినా దానిపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్న మోదీ ఈ సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ సిక్కుమత కేంద్రాన్ని యాత్రీకులు ఇకనుంచి స్వేచ్ఛగా సందర్శించే అవకాశం ఉంటుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అనేక పథకాలను కూడా మోదీ ఈ సందర్భంగా వివరించారు. తాము మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలకు గుర్తింపుగానే రెండోసారి కూడా ప్రజలు తమకు పూర్తి మెజారిటీని కట్టబెట్టారని మోదీ అన్నారు. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
*చిత్రం...బ్యాంకాక్‌లో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ