అంతర్జాతీయం

సైనిక శిబిరంపై ఉగ్ర దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమాకో, నవంబర్ 2: మాలీ దేశ ఈశాన్య ప్రాంతంలోని ఓ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 53 మంది జవాన్లు మరణించారు. ఇటీవల కాలంలో ఇంత ఘోరమైన దాడి తమ దేశంపై జరగలేదని, ఈ దాడిలో ఓ పౌరుడు కూడా మరణించాడని ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టామని కమ్యూనికేషన్ల మంత్రి యాయా సంగారే తెలిపారు. ఈ దాడిలో సైనిక శిబిరం పూర్తిగా ధ్వంసమైందని, 10 మంది జవాన్లు ప్రాణాలతో బయటపడ్డారని ఆయన వివరించారు. కాగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సంఘటన ప్రాంతానికి భారీగా సైన్యాన్ని తరలించామని, ఈ ఘాతుకానికి పాల్పడ్డవారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈ దాడికి సంబంధించి ఏ మిలిటెంట్ సంస్థ బాధ్యత తీసుకోలేదు.