అంతర్జాతీయం

కలిసికట్టుగా కృషి చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 4: భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింగో అబే సోమవారం ఇక్కడ ద్వైపాక్షిక, భద్రత అంశాలపై విస్తృత సమీక్ష జరిపారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వీరు లోతుగా సమీక్షించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీ, అబే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇరు దేశాల మధ్య సంబంధాలను ఏవిధంగా బలోపేతం చేయాలన్న దానిపై దృష్టి సారించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనికంగాను, ఆర్థికంగాను చైనా చేపడుతున్న విస్తరణ చర్యలపై వీరిద్దరూ చర్చించడంతోపాటు వీటిని ఏవిధంగా ఎదుర్కోవాలన్నదానిపైనా మంతనాలు సాగించారు. అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్న అంశంపై ఇరు దేశాల ప్రధానులు తమ వైఖరిని ఈ చర్చల సందర్భంగా పునరుద్ఘాటించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. తృతీయ దేశాలు సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతియుత పరిస్థితులతో విలసిల్లేలా చేయాలని ఈ సందర్భంగా మోదీ, అబే సంకల్పించినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకు ధోరణిపై 10 దేశాల ఆసియాన్ కూటమిలో అలజడి రేగుతున్న నేపథ్యంలో భారత్-జపాన్ ప్రధానులు ఇదే అంశాన్ని కేంద్రీకరించి చర్చించడానికి ప్రాధాన్యత చేకూరింది. అలాగే, ఈ నెల చివరిలో భారత్‌లో పర్యటించనున్న ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల అధికారులు తొలి సమావేశంపైన కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని వివరించారు. ఈ రకమైన సమావేశం వల్ల భారత్-జపాన్ మధ్య రక్షణ, భద్రత సహకారానికి మరింత ఊతం లభిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జపాన్ ప్రధాని షిండో అబే తనకు అత్యంత సన్నిహితమైన మిత్రుడని, ఆయనతో ఎప్పుడు చర్చలు జరిపినా అవి సుహృద్భావ రీతిలోనే సాగుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు అనేక అంశాలపై తమ మధ్య చర్చలు జరిగాయని మోదీ వివరించారు.
వచ్చేనెలలో భారత్‌లో జరుగనున్న ఇండో-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి షిండో అబే రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నాలుగు నెలల కాలంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య సమావేశం జరగడం ఇది మూడోసారి.
*చిత్రం... జపాన్ ప్రధాని షింజో అబేతో సోమవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా కరచాలనం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ