అంతర్జాతీయం

అమెరికా నిర్ణయం విచారకరం: ఫ్రాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, నవంబర్ 5: పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా లాంఛనంగా నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఫ్రాన్స్ మంగళవారం విచారం వ్యక్తం చేసింది. అమెరికా తీసుకున్న ఈ చర్య ఊహించిందేనని, అయితే ఈ చర్య పట్ల తాము విచారం వ్యక్తం చేస్తున్నామని, ఈ చర్య వల్ల వాతావరణం, జీవవైవిధ్యంపై ఫ్రాంకో-చైనీస్ భాగస్వామ్యం అవసరం మరెంతో పెరిగిందని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ అధికారిక పర్యటనలో భాగంగా చైనాలో ఉన్న సమయంలో అధ్యక్ష కార్యాలయం ఈ ప్రకటన జారీ చేసింది. బీజింగ్‌లో బుధవారం జరుగనున్న చర్చల సందర్భంగా వాతావరణంపై రూపొందించిన ఒక ఉమ్మడి పత్రంపై ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంతకం చేయనున్నారు. పారిస్ ఒప్పందాన్ని తిరుగులేనిదిగా, మార్చలేనిదిగా ఈ సంయుక్త పత్రం ప్రకటిస్తుందని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.